శరీర సౌందర్యం ముఖ్యం | Body beauty is important | Sakshi
Sakshi News home page

శరీర సౌందర్యం ముఖ్యం

Apr 27 2017 1:22 AM | Updated on Jul 23 2018 9:15 PM

శరీర సౌందర్యం ముఖ్యం - Sakshi

శరీర సౌందర్యం ముఖ్యం

తారలకు శరీర సౌందర్యం ముఖ్యమని నటి కేథరిన్‌ ట్రెసా అంటోంది. ఇటీవల ఈ బ్యూటీ ఆర్యతో కలిసి నటించిన కడంబన్‌ చిత్రం

టీనగర్‌: తారలకు శరీర సౌందర్యం ముఖ్యమని నటి కేథరిన్‌ ట్రెసా అంటోంది. ఇటీవల ఈ బ్యూటీ ఆర్యతో కలిసి నటించిన కడంబన్‌ చిత్రం విడుదలై అభిమానుల నీరాజనాలు అందుకుంటోంది. అంతేగాకుండా కేథరిన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా కేథరిన్‌ ట్రెసా మాట్లాడుతూ తాను అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ, కడంబన్‌ లాంటి చిత్రంలో నటించలేదని, అంతలా కష్టపడింది లేదన్నారు. కొన్ని రోజులపాటు నటించిన తనకే అంత కష్టంగా అనిపిస్తే, అటవీ, కొండ ప్రాంతాల్లో నివసించే మహిళలను చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. అందుకే వారికి తన సెల్యూట్‌ అన్నారు.

తదుపరి విష్ణుతో కథానాయగన్‌ చిత్రంలో నటించనున్నానని, తనతోపాటు నటించిన అనేక మంది నటులు తనను ఎంతగానో ప్రశంసించినట్లు తెలిపారు. నటీమణులకు శారీరక సౌందర్యం అతి ముఖ్యమని, తాను ప్రతిరోజూ తప్పకుండా యోగా, ఏరోబిక్స్‌ చేస్తానన్నారు. అలాగే, ఫాస్ట్‌ఫుడ్స్‌ జోలికి వెళ్లనని, స్వీట్స్‌ కూడా నిషేధించినట్లు తెలిపారు. దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని, ఇందుకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిం చాలని కోరారు. తాను దుబాయ్‌లో పెరిగానని, అక్కడలా మహిళలపై హింసకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement