
‘‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. నా కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని నమ్మాను.. ఈ సినిమాతో నా నమ్మకం మరోసారి నిజమైంది’’ అని నితిన్ అన్నారు. ఎమ్‌ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా, కృతీ శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటింన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలయింది.
శనివారం థ్యాంక్స్ మీట్‌లో నితిన్ మాట్లాడుతూ– ‘‘చాలాకాలం తర్వాత నా జోనర్‌ని మార్చి యాక్షన్‌లోకి వెళ్లాను.. ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. యాక్షన్, కామెడీ సీన్స్‌కి ప్రేక్షకుల చప్పట్లు, విజిల్స్ నాలో ఉత్సాహాన్నిచ్చాయి. ఈ సమయంలో ఇంత మంచి ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమాని ఇంత గొప్ప సక్సెస్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిఖితా రెడ్డి.
‘‘మా చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు రాజశేఖర్ రెడ్డి. ‘‘మా చిత్రం తొలి రోజే రూ. 10కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు కృతీ శెట్టి.
Comments
Please login to add a commentAdd a comment