
మాచర్ల నియోజకవర్గం సినిమాకు కొత్త చిక్కు వచ్చిపడింది. డైరెక్టర్ ఎమ్‌ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఓ వ్యక్తి ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి కొన్ని వర్గాలను కించపరిచేలా కామెంట్లు చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ కాగా ఆ మాటలు అన్నది డైరెక్టరే అనుకుని మాచర్ల నియోజకర్గాన్ని బహిష్కరించాలంటూ పలువురూ కామెంట్లు చేస్తున్నారు.
ఎవరో పనికట్టుకుని ఇదంతా చేస్తున్నారని ఆగ్రహించిన డైరెక్టర్ బుధవారం నాడు పోలీసులను ఆశ్రయించాడు. తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుగా పోస్ట్ చేస్తున్నారని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజశేఖర్ అనే పేరుతో ఉన్న ఓ అకౌంట్ నుంచి కొందరు మూడేళ్ల క్రితం కొన్ని కులాలను తిడుతూ ఓ ట్వీట్ చేశారని, దాన్ని తనకు అంటగడుతూ, మాచర్ల ముచ్చట్లు అంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించాడు. ఆ అకౌంట్ తనది కాదని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫేక్ ట్వీట్ల స్క్రీన్‌షాట్లను పోలీసులకు అందించాడు. దర్శకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: బ్రేకప్ చెప్పుకున్న బాలీవుడ్ లవ్‌బర్డ్స్
అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్
Comments
Please login to add a commentAdd a comment