Nithin Macherla Niyojakavargam OTT Release: Is Movie Will Stream On Amazon Prime? - Sakshi
Sakshi News home page

Macherla Niyojakavargam In OTT: ఓటీటీకి మాచర్ల నియోజకవర్గం.. అక్కడే స్ట్రీమింగ్‌!

Published Wed, Aug 17 2022 2:02 PM | Last Updated on Wed, Aug 17 2022 3:29 PM

Is Amazon Prime Locks Nithin Macherla Niyojakavargam OTT Streaming - Sakshi

హీరో నితిన్‌, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ మాచర్ల నియోజకవర్గం. ఆగస్ట్‌ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. తొలి షో నుంచే ఈ మూవీ ఫ్లాప్‌టాక్‌ తెచ్చుకుంది. విడుదలకు ముందు వచ్చిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌, స్పెషల్‌ సాంగ్‌ ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకులను ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎలాగైన ఈసారి హిట్‌ కొట్టాలని ఎదురు చూసిన నితిన్‌ను మాచర్ల నియోజకవర్గం నిరాశ పరిచింది.

చదవండి: తాప్సీపై డైరెక్టర్‌ వల్గర్‌ కామెంట్స్‌, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

బిగ్‌స్రీన్‌పై పెద్దగా సందడి లేని ఈ చిత్రం త్వరలో ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైం ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 9న మాచర్ల నియోజకవర్గంను ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. దీనిపై త్వరలోనే మేకర్స్‌ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం. ఇక థియేటర్లో నిరాశ పరిచిన ఈ మూవీ సందడి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ తెచ్చుకొనుంది వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement