Actress Anjali Act Special Song In Nithiin Macherla Niyojakavargam Movie - Sakshi
Sakshi News home page

Macherla Niyojakavargam: మరోసారి స్పెషల్‌ సాంగ్‌లో అంజలి.. నితిన్‌తో కలిసి స్టెప్పులు

Jul 3 2022 1:34 PM | Updated on Jul 3 2022 2:47 PM

Actress Anjali Act Special Song In Nithiin Macherla Niyojakavargam Movie - Sakshi

యంగ్‌ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, కేథరిన్‌ థ్రెసా కథానాయికలు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం..టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది.

ఇటీవల  విడుదలైన పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ కు కూడా ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆగస్ట్‌ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ని స్టార్ట్‌ చేశారు మేకర్స్‌. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ మూవీలో హీరోయిన్‌ అంజలి స్పెషల్‌ సాంగ్ చేయబోతుందట. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. అందులో అంజలి హాట్‌ ఫోజుతో కుర్రాళ్ల మతి పోగొట్టేలా ఉంది. ఈ స్పెషల్‌ సాంగ్‌కి సంబంధించిన మరో అప్‌డేట్‌ని సోమవారం ప్రకటించనున్నారు. అంజలికి ఇది రెండో స్పెషల్‌ సాంగ్‌. గతంలో స‌రైనోడులో అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement