
నితిన్, కృతీశెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిరాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన స్పెషల్ సాంగ్ ‘రారా రెడ్డి’ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ పాటకి 20 మిలియన్స్ పైగా వ్యూస్, 3లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
నితిన్, అంజలి ఎనర్జిటిక్ కెమిస్ట్రీ , కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మాస్ డ్యాన్స్ నంబర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. ఇక పాటలోని ‘రాను రాను అంటూనే చిన్నదో’ పల్లవికి లక్షలాది సంఖ్యలో రీల్స్ వచ్చాయి. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. ఆగస్ట్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment