
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు కొంత లక్ కూడా ఉండాలి. ఈ రెండూ తోడైతే మాత్రం వారిని ఆపడం ఎవరితరమూ కాదు. ప్రస్తుతం కృతీశెట్టికి గోల్డెన్ టైం నడుస్తోంది. తొలి చిత్రం ఉప్పెనతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆ తర్వాత వెంటవెంటనే శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది ‘బేబమ్మ’. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
ఈ క్రమంలో రామ్‌తో 'ది వారియర్', సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్‌తో 'మాచర్ల నియోజకవర్గం' వంటి సినిమాలకు సంతకం చేసింది. ఇటీవల ది ‘ది వారియర్’ చిత్రం విడుదల కాగా ఈ మూవీతో తొలి పరాజయం అందుకుంది.
చదవండి: లోకేశ్ కనకరాజు-విజయ్ చిత్రం, ‘విక్రమ్’ను మించిన స్క్రిప్ట్! అదిరిపోయిందిగా..
ప్రస్తుతం కృతీ ఆశలన్ని మాచేర్ల నియోజకవర్గం చిత్రంపైనే ఉన్నాయి. ఆగస్ట్ 12న ఈ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది ఆమె. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ-రిలీజ్‌లో ఈవెంట్‌లో కృతి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.
ఈ సందర్భంగా తనకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ గరించి బయటపెట్టింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల తనకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని, అయితే తాను ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పింది. టాలీవుడ్ ఏం కావాలో అది ఇచ్చిందని, అందుకే తనకు బాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం లేదని కృతి వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment