కన్నడ రీమేక్‌లో నితిన్‌ హిట్‌ మూవీ, దర్శకుడు ఎవరో తెలుసా! | Nithin Jayam Movie Remake In Kannada After 18 Years | Sakshi
Sakshi News home page

కన్నడ రీమేక్‌లో నితిన్‌ హిట్‌ మూవీ, దర్శకుడు ఏవరంటే..

Published Sun, May 2 2021 7:58 PM | Last Updated on Sun, May 2 2021 8:47 PM

Nithin Jayam Movie Remake In Kannada After 18 Years - Sakshi

తేజా డైరెక్షన్‌లో నితిన్‌ హీరోగా పరిచమైన చిత్రం ‘జయం’. 2002లో వచ్చిన ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ మూవీలో నటించిన హీరోహీరోయిన్‌తో పాటు మిగతా నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక గోపిచంద్‌ విలన్‌గా ఏ రేంజ్‌ నటించాడో అందరికి తెలిసిందే.  ఇందులో నితిన్‌ సరసన కథానాయికగా సదా నటించిన విషయం తెలిసిందే.

తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ మూవీ అదే పేరుతో తమిళంలో కూడా రీమేక్‌ అయ్యింది. ఇందులో హీరోగా రవి నటించగా.. అక్కడ కూడా సదానే హీరోయిన్‌గా నటించింది. మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలోనూ సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో హీరో రవి పేరు కాస్తా ‘జయం’ రవిగా మారిపోయింది. ఈ సినిమా వచ్చి నేటికి 18 ఏళ్లు. కాగా.. ఇన్నేళ్ల తర్వాత ‘జయం’ కన్నడలో రీమేక్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ రీమేక్‌కు ‘కేజీఎఫ్‌’ హీరో, కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌ను హీరోగా పరిచయం చేసిన శశాంక్‌ దర్శకుడిగా వ్యవహరించనున్నాడట. కర్ణాటకకు చెందిన ప్రవీణ్‌ అనే డాక్టర్‌ ఈ సినిమాతో హీరో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తున్న ప్రవీణ్‌ ఆ తర్వాత ఈ రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళంలో సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన ఈమూవీ కన్నడ ప్రేక్షకులను ఎంతటి స్థాయిలో ఆకట్టుకంటుందో వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement