
Nithins Macherla Niyojakavargam Movie Locks Its Release Date: నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎంఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో నితిన్ సరసన కృతీశెట్టి హీరోయిన్‌గా కనిపిస్తారు.
జిల్లా కలెక్టర్ పాత్రలో నితిన్ కనిపిస్తారని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘నితిన్‌ను కొత్త అవతారంలో చూపించే సినిమా ఇది. ఈ చిత్రంలో రాజకీయ అంశాలు హైలైట్‌గా ఉంటాయి. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment