Hero Nithin Wife Shalini Birthday: Tested Covid 19 Positive Even He Celebrates,Video Goes Viral - Sakshi
Sakshi News home page

Nithin: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌..

Published Fri, Jan 7 2022 9:39 AM | Last Updated on Fri, Jan 7 2022 5:39 PM

Nithin Wife Shalini Kandukuri Tested Covid 19 Positive Even He Celebrates Wife Birthday - Sakshi

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కోవిడ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, హీరోహీరోయిన్లు వరసగా కరోనా బారిన పడుతున్నారు. అలాగే టాలీవుడ్‌ సెలెబ్రెటీలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే మంచు మనోజ్‌, మంచు లక్ష్మి, నిన్న సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  తాజాగా యంగ్‌ హీరో నితిన్‌ భార్య శాలిని సైతం కరోనా బారిన పడింది. అయితే నేడు ఆమె పుట్టిన రోజు.

చదవండి: ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్‌కు అమెజాన్‌ ఒప్పందం ఎంతో తెలుసా? షాకవ్వాల్సిందే..

అయితే భార్యకు కరోనా సోకినప్పటికి నితిన్‌ తన భార్య బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసి ఆమెకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. భార్య బర్త్‌డే వినూత్నంగా సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ ఆ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ భార్యపై ప్రేమ కురిపించాడు. ‘కోవిడ్‌కి సరిహద్దులు ఉన్నాయేమో, మన ప్రేమకి సరిహద్దులు లేవు, హ్యాపీ బర్త్ డే టు మై లవ్. లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వు నెగిటివ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

చదవండి: కరోనా ఎఫెక్ట్‌.. మరో భారీ బడ్జెట్‌ చిత్రం వాయిదా

చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్‌

భార్యకు కరోనా సోకినప్పటికి వేరువేరుగా ఉంటూ నితిన్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేయడం చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేగాక భార్య పట్ల నితిన్‌కు ఉన్న ప్రేమను  మెచ్చుకుంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తన వైఫ్‌కు కరోనా రావడంతో వాళ్ళ ఇంట్లో పైన ఒక రూమ్‌లో ఆమె ఐసోలేషన్‌లో ఉంది. దీంతో ఆమె కిటికి లోంచి చూస్తూ ఉంటే కింద గార్డెన్ ఏరియాలో నితిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి విషెష్ తెలియచేశాడు. కింద నుంచే కేక్ చూపించి తిను అన్నట్లు చెప్పాడు నితిన్. ఇలా దూరం దూరంగా ఉండి నితిన్ తన వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement