
రామ్ చరణ్
‘కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ఏడాది నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దు’ అని రామ్ చరణ్ తన అభిమానులను కోరారు. మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మెగా అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. అన్నదానం, రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాలూ చేపట్టేవారు. అయితే ఈ ఏడాది బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి దూరంగా ఉండాలంటూ రామ్‌చరణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
దాని సారాంశం ఇలా... ‘‘మీకు (అభిమానులు) నాపై ఉన్న ప్రేమ, నా పుట్టినరోజుని పండుగగా జరపడానికి మీరు పడుతున్న కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. మనం ఉన్న ఈ అసాధారణ పరిస్థితులు మీకు తెలియనివి కాదు. ఇలాంటి సందర్భాల్లో జనం తక్కువగా ఉండేట్టు చూసుకోవడం మంచింది. ఇది మనసులో పెట్టుకుని ఈ సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలను విరమించుకోవాల్సిందిగా మనవి. మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకి అర్థమయ్యేలా తెలియజేసి మీ వంతు సామాజిక బాధ్యత నెరవేర్చండి. అదే నాకు మీరు ఇచ్చే అతి పెద్ద పుట్టినరోజు కానుక’’.
Comments
Please login to add a commentAdd a comment