Macherla Niyojakavargam: Nithin Speed Up The Shooting Of Movie Deets Here - Sakshi
Sakshi News home page

Macherla Niyojakavargam Movie: స్పెషల్‌ మాస్‌ సాంగ్‌లో చిందేసిన నితిన్‌

Published Mon, Mar 14 2022 10:59 AM | Last Updated on Mon, Mar 14 2022 11:34 AM

Nithin Speed Ups The Shooting Of Macherla Niyojakavargam - Sakshi

Nithin's Macherla Niyojakavargam Movie: విలన్స్‌ని రఫ్ఫాడించిన నితిన్‌ కొంచెం కూల్‌ అయ్యేందుకు ఓ స్పెషల్‌ మాస్‌ సాంగ్‌లో చిందేశారు. ఈ ఫైటు, పాటలను విజువల్‌గా వెండితెరపై చూడాల్సిందే. నితిన్‌ హీరోగా, కృతీశెట్టి, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎడిటర్‌ ఎమ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఆదిత్యా మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ట్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

‘‘అనల్‌ అరసు కంపోజ్‌ చేసిన ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ను పూర్తి చేశాను. ఆ వెంటనే జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేసిన ఓ మాస్‌ సాంగ్‌ చేశాను. ఫస్ట్‌లుక్, టీజర్‌ల అప్‌డేట్స్‌ను త్వరలోనే చెబుతాం’’ అని నితిన్‌ పేర్కొన్నారు. ఈ సినిమాకు సంగీతం: మహతి స్వరసాగర్, లైన్‌ ప్రొడ్యూసర్‌: జి.హరి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement