Maestro Movie Release In Disney Plus Hotstar: నితిన్‌ మాస్ట్రో కూడా ఓటీటీలోనే, మేకర్స్‌ స్పష్టం - Sakshi
Sakshi News home page

OTT: నాని బాటలోనే హీరో నితిన్‌.. ‘మాస్ట్రో’ నిర్మాతల క్లారీటీ

Published Fri, Aug 20 2021 2:11 PM | Last Updated on Fri, Aug 20 2021 3:40 PM

Nithin Maestro Movie Release On OTT Disney Plus Hotstar - Sakshi

ఇప్ప‌టికీ థియేట‌ర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడంతో పెద్ద సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయంటూ కొద్ది రోజులు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో నాని టక్‌ జగదీష్‌, నితిన్‌ మాస్ట్రో, నాగచైతన్య లవ్‌స్టోరీ, గోపిచంద్‌ సిటీమార్‌తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. అయితే ఇవి వట్టి పుకార్లేనని సదరు సినీ మేకర్స్‌ ఖండిస్తూ వచ్చారు. అయితే ఈ రూమార్లను నిజం చేస్తూ టక్‌ జగదీష్‌ మూవీ  ఓటీటీలోనే విడుదల అవుతున్నట్లు ఇప్పటికే హీరో నాని ప్రకటించగా తాజాగా ఆయన బాటలోనే నితిన్‌ కూడా చేరాడు.

చదవండి: Nani Tuck Jagadish: థియేటర్ల యాజమానుల అసంతృప్తి

నితిన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం మాస్ట్రో. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతుందని నితిన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. అలాగే మేకర్స్‌ సైతం ‘మాస్ట్రో’ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనితోపాటు ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. నితిన్, న‌భా, త‌మ‌న్నాల‌తో కూడిన పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు మేక‌ర్స్. ఈ చిత్రం హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అంధాదున్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా రూపొందింది.

చదవండి: నాకు చేతబడి చేశారు, 13 ఏళ్లు నరకం చూశా: నటుడు

మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లగా మాస్ట్రో తెరకెక్కింది. ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనుండా ఆయనకు జోడిగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో కనిపించనుంది. ఎప్పుడు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎప్పుడో విడుద‌ల కావ‌లసి ఉండగా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement