‘‘కులం, మతం కంటే స్నేహం చాలా గొప్పది అనే సందేశాన్ని ‘ఆయ్’ సినిమాలో వినోదాత్మకంగా చూపించాం. ఈ నెల 15న చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే మా ‘ఆయ్’ కి ఉండాల్సిన ఆడియన్స్ మాకున్నారని అనుకుంటున్నాం. మంచి వినోదంతో కూడిన గోదావరి నేపథ్యంలో సినిమా వచ్చి చాలా రోజులైంది. ‘ఆయ్’ని కచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం’’ అని నార్నే నితిన్ అన్నారు. హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఆయ్’.
అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నార్నే నితిన్ మాట్లాడుతూ–‘‘ అంజి కె.మణిపుత్రది అమలాపురం. ఆయన లైఫ్‌లో చూసినవన్నీ కలిపి చేసిన సినిమానే ‘ఆయ్’. ఈ చిత్రంలో ఫుల్ ఫన్ ఉంటుంది కాబట్టి పోస్టర్స్‌లో అంతా ఫన్ బాత్ అని పెట్టాం.. ఇది డైరెక్టర్‌గారి ఆలోచనే. గోదావరి యాసలో ఆయ్ అనే పదాన్ని సాధారణంగా వాడుతుంటాం.
ఆ నేపథ్యంలో సాగే ఈ మూవీకి ‘ఆయ్’ కరెక్ట్ టైటిల్ అని అల్లు అరవింద్‌గారు చెప్పడంతో ఫిక్స్ చేశారు. ‘మ్యాడ్’ చిత్రంలో కథకు తగ్గట్టు బిహేవ్ చేశాను. ‘ఆయ్’లో కథకు తగ్గట్టు నటించాను. గీతా ఆర్ట్స్ వంటి పెద్ద సంస్థలో సినిమా చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నయన్ సారిక మరాఠీ అమ్మాయి అయినా అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుంది. తన పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. రామ్ మిర్యాలగారు మూడు పాటలకు సంగీతం అందించారు.
అలాగే అజయ్ అరసాడగారు రెండు పాటలకు మ్యూజిక్ ఇవ్వడంతో పాటు నేపథ్య సంగీతం ఇచ్చారు. ఎన్టీఆర్‌గారు ‘ఆయ్’ ట్రైలర్ చూశారు. అందులోని కామెడీని ఎంజాయ్ చేశారు. సినిమా చూసిన తర్వాత కూడా ఆయన దగ్గర నుంచి అలాంటి స్పందన వస్తే బావుంటుందనిపిస్తోంది. ప్రస్తుతం ‘మ్యాడ్ 2’ మూవీలో నటిస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment