Nitin Maestro Movie | Vennello Aadapilla Song Promo Release - Sakshi
Sakshi News home page

Maestro: వెన్నెల్లో ఆడపిల్లే తనా... సాంగ్‌ ప్రోమో రిలీజ్‌

Published Thu, Aug 5 2021 8:53 AM | Last Updated on Thu, Aug 5 2021 1:46 PM

Vennello Aadapilla Song Promo Released In Maestro - Sakshi

Maestro Song: నితిన్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. నభా నటేష్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్ర చేశారు. రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఎన్‌.సుధాకర్‌ రెడ్డి–నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘అనగనగా అందమైన కథగా మొదలైన ఈ మనసే.. వెన్నెల్లో ఆడపిల్లే తనా.. ఈ చీకటై మిగిలానా..’ అంటూ సాగే పాట ప్రోమోను విడుదల చేశారు.

మహతి స్వరసాగర్‌ ఈ పాటకు సంగీతం అందించగా, స్వీకర్‌ అగస్తి ఆలపించారు. శ్రీజో–కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. ‘వెన్నెల్లో ఆడపిల్ల’ పూర్తి పాటని ఈ నెల 6న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement