బస్టాండే.. బస్టాండే... | Nithin Rang de second song release | Sakshi
Sakshi News home page

బస్టాండే.. బస్టాండే...

Published Sun, Feb 28 2021 5:49 AM | Last Updated on Sun, Feb 28 2021 5:49 AM

Nithin Rang de second song release - Sakshi

బస్టాండే... బస్టాండే.. సింపుల్‌గుండే లైఫు.. టెంపుల్‌ రన్‌లా మారే.. ఈ రంగు రంగు లోకం .. చీకట్లోకి జారే లవ్లీగుండే కళలే.. లైఫే లేనిదాయే స్మైలీ లాంటి ఫేసే.... స్మైలే  లేనిదాయే’ హీరోయిన్‌కి తాళి కట్టే ముందు హీరో పాడే పాట ఇది. ఈ బాధ ఎందుకు? అనేది ‘రంగ్‌ దే’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నితిన్, కీర్తీ సురేష్‌ హీరో హీరోయిన్‌గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ఇది. పీడీవీ ప్రసాద్‌ సమర్పకులు. నితిన్, కీర్తిపై చిత్రీకరించిన ఈ చిత్రంలోని రెండో పాట ‘సింపుల్‌గుండే లైఫు..’ని శనివారం విడుదల చేశారు. ‘‘ఫస్ట్‌ పాటకు కోటికి పైగా వ్యూస్‌ వచ్చాయి. రెండో పాట కూడా వీనులవిందుగా ఉంటుంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగుంటాయి. కుటుంబసమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని మార్చి 26న రిలీజ్‌ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం (వెంకట్‌).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement