
బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం 'అంధాధున్'. తెలుగులో నితిన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ రీమేక్ బాధ్యతను తన భుజానెత్తుకున్నాడు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 11న థియేటర్లలో సందడి చేయనున్నట్లు వెల్లడించారు. నితిన్ అంధుడిగా, సంగీతకారుడిగా కనిపించనున్న ఈ సినిమాలో హీరోయిన్ నభా నటేశ్ అతడితో జోడీ కడుతోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న టబు పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
JUNE 11th is the Date!!
— nithiin (@actor_nithiin) February 19, 2021
#Nithiin30
@tamannaahspeaks @NabhaNatesh @GandhiMerlapaka @SreshthMovies_ pic.twitter.com/jTGdMRLslA
అంధుడైన హీరో ఓ హత్యకు ఎలా సాక్షిగా మారతాడనేది ఈ చిత్ర ప్రధాన కథ. బాలీవుడ్‌లో ఈ సినిమా ఆయుష్మాన్ ఖురానాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. మరి నితిన్‌కు ఈ సినిమా ఎన్ని ఫలాలనిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే అతడు దేశదద్రోహిగా నటించిన 'చెక్' ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు 'రంగ్‌దే' మార్చి 26న ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ తీసుకుని 'అంధాధున్' రీమేక్‌తో అభిమానులను అలరించేందుకు రానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment