యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయిక. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో సరికొత్తగా కనిపించనున్నాడు. రాజకీయ నేపథ్యంతో వస్తున్న ఈ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 12న విడుదల కాబోతోంది.
ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నితిన్ కొత్త రూటు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర సీరియల్స్‌లో కనిపించి ప్రేక్షకులను తన సినిమా చూడమని అడగనున్నాడట ఈ హీరో. అంటే కొద్ది క్షణాల పాటు సీరియల్‌లో అలా ప్రత్యక్షమై ఇలా మాయమవుతాడన్నమాట. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే నితిన్ సీరియల్స్‌లో కనిపించడం ఇదే తొలిసారి అవడం ఖాయం.
చదవండి: పురిట్లోనే మరణించిన బిడ్డ కోసం తల్లడిల్లిపోతున్న సింగర్ భార్య
ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు
Comments
Please login to add a commentAdd a comment