సెంటిమెంట్‌... అడ్వెంచర్‌  | Nithin Thammudu Movie First Look Poster Out | Sakshi
Sakshi News home page

సెంటిమెంట్‌... అడ్వెంచర్‌ 

Published Sun, Mar 31 2024 12:39 AM | Last Updated on Sun, Mar 31 2024 12:39 AM

Nithin Thammudu Movie First Look Poster Out - Sakshi

నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘తమ్ముడు’. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. శనివారం (మార్చి 30) నితిన్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా టైటిల్‌ లోగో, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటి లయ కీలక పాత్ర చేస్తున్నారు.

ఈ సినిమాకు బి. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘భీష్మ’ వంటి సక్సెస్‌ఫుల్‌ మూవీ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ మూవీ ‘రాబిన్‌ హుడ్‌’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement