Narne Nithin Chandra First Look Out From Sri Sri Rajavaru Movie - Sakshi
Sakshi News home page

Jr NTR: తారక్‌ బావమరిది మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

Published Sat, Mar 19 2022 8:23 AM | Last Updated on Sat, Mar 19 2022 12:30 PM

Narne Nithin Chandra First Look Out From Sri Sri Rajavaru - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ బావమరిది, పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘శతమానం భవతి’ ఫేమ్‌ వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో శ్రీ వేదాక్షర మూవీస్‌పై రామారావు చింతపల్లి, ఎమ్‌ఎస్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే టైటిల్‌ ఖరారు చేసి, ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘నితిన్‌కు మీ (ప్రేక్షకుల) ఆశీర్వాదం ఉండాలి’’ అన్నారు వేగేశ్న సతీష్‌. ఈ సినిమాకు  కైలాస్ మీనన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్‌, విలన్‌, మిగతా నటీనటులను త్వరలోనే ప్రకటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement