Narne Srinivasa Rao
-
జూ.ఎన్టీఆర్ బావమరిది మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ వచ్చేసింది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘శతమానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో శ్రీ వేదాక్షర మూవీస్‌పై రామారావు చింతపల్లి, ఎమ్ఎస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘నితిన్‌కు మీ (ప్రేక్షకుల) ఆశీర్వాదం ఉండాలి’’ అన్నారు వేగేశ్న సతీష్. ఈ సినిమాకు కైలాస్ మీనన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్, విలన్, మిగతా నటీనటులను త్వరలోనే ప్రకటించనున్నారు. -
సొంత తమ్ముడినే పట్టించుకోని బాబు
పట్నంబజారు (గుంటూరు) : తమ్ముళ్లూ.. తమ్ముళ్లూ అని జపం చేసే నారా చంద్రబాబునాయుడు సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడు ఆరోగ్యం బాగోకపోయినా పట్టించుకోలేదని.. ఆయన్ను నమ్మి మోసపోవద్దని వైఎస్సార్ సీపీ నాయకుడు, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తోడబుట్టిన చెల్లెలికి యాక్సిడెంట్ అయినా చంద్రబాబు కనీసం పరామర్శించిన పాపాన పోలేదని నిప్పులు చెరిగారు. మంగళవారం గుంటూరులో నార్నె శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు పార్టీలో అందరూ చీటర్లేనని.. సుజనాచౌదరి, సీఎం రమేష్ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మితే.. ఫ్యాంటు, చొక్కా విప్పి రోడ్డుపై నిలబెడతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణ చంద్రబాబుకు బినామీ అని ఆరోపించారు. చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ ఒక శుంఠ అని, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ గెలిచే మొట్టమొదటి స్థానం మంగళగిరి అని స్పష్టం చేశారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని, ఆయనది దొంగల పార్టీ అని దుయ్యబట్టారు. ప్రజలు ఎంతో గౌరవించే ఎన్టీఆర్‌ను ‘వాడు, వీడు’ అని సంబోధించటం సిగ్గుచేటన్నారు. తన నుంచి ‘స్టూడియో ఎన్’ ఛానల్‌ను తీసుకున్న చంద్రబాబు డబ్బులు ఇవ్వలేదని, బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో సైతం బాబు కాసుల కోసం కక్కుర్తి పడతారన్నారు. చంద్రబాబుకు రాజకీయ సన్యాసం తథ్యమని జోస్యం చెప్పారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాధం భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మంగళగిరి పేరును అమంగళం చేశారు’
సాక్షి, విజయవాడ: మంత్రి నారా లోకేశ్ మంగళగిరి పేరును అమంగళం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నార్నే శ్రీనివాసరావు విమర్శించారు. లోకేశ్ కోసం కోపరేటివ్ సంస్థలన్నింటినీ చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు ముగిసేవరకు వైఎస్సార్సీసీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మూడు రోజుల్లో చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నుతారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడుతారని పేర్కొన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్‌ల కంటే మంచి పాలన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తారని నమ్ముతున్నట్టు తెలిపారు. చంద్రబాబు తన తమ్ముడు రామ్మూర్తి నాయుడని బయటి ప్రపంచానికి చూపించగలరా అని ప్రశ్నించారు. సొంత చెల్లికి యాక్సిడెంట్ అయితే చంద్రబాబు ఇంతవరకు పట్టించుకోలేదంటే ఆయన మనసు అర్థం చేసుకోవచ్చన్నారు. బాలకృష్ణ అంటే చంద్రబాబుకు భయమని పేర్కొన్నారు. తాను ఏనాడు చంద్రబాబుని సీట్లు అడగలేదని స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో ఒక మాట, ఆంధ్రప్రదేశ్‌లో ఒక మాట మాట్లాడతారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్టు పవన్ ఆడతారని ఆరోపించారు. బాలకృష్ణ తీసిన బయోపిక్ కంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఎటువంటి హాని చేయనప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలో విడుదల కాకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా చేసింది కూడా చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. పది ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే.. చంద్రబాబు దానిని వదిలి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్లే రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలు ఆడటంలో చంద్రబాబుకు గిన్నిస్ రికార్డు వస్తుందని వ్యాఖ్యానించారు. -
‘మంగళగిరి పేరును అమంగళం చేశారు’
-
తమ్ముడు,చెల్లినే చూడనోడు రాష్ట్రాన్ని చూస్తాడా?
సాక్షి, హైదరాబాద్: ‘‘28 ఏళ్లు దగ్గరగా చంద్రబాబును చూశాను. అతను ఎంత మోసగాడో చూశా. దేనికైనా తెగిస్తాడు. ప్రతిదాంట్లో కోవర్టులను పెడతాడు. తానే అన్ని చేస్తాడు. అతను కంపెనీకి సీఈవోగా మేనేజిమెంట్‌కు పనికివస్తాడు. పాలకుడిగా ప్రజలకు సీఎంగా పనికిరాడు. ఎక్కడ మోసం చేయవచ్చు... ఎక్కడ లాభం పొందవచ్చు.. ఎవరిని ఎక్కడ ముంచవచ్చు అనేది చంద్రబాబుకు బాగా తెలుసు’’ అని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో ఏపీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసి 600కుపైగా హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయాడని, పరిపాలనలో పూర్తిగా అట్టర్‌ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. చంద్రబాబును ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలందరికీ చేరిందని, ఏపీ ప్రజలు జగన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానన్నారు. సొంతవాళ్లనే చూడనివాడు.. జనాన్ని ఏం చూస్తాడు? సీఎం చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కానేకాదని నార్నె అన్నారు. సొంత తమ్ముడినే మోసం చేశాడన్నారు. రామ్మూర్తినాయుడు పరిస్థితి దారుణంగా ఉందని, నెలరోజులనుంచి నీ తమ్ముడిని చూపించమని అడుగుతున్నా స్పందన లేదన్నారు. 12 రోజులక్రితం సొంత చెల్లెలు తిరుపతిలో ప్రమాదం జరిగి దారుణ పరిస్థితి గడుపుతోందన్నారు. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. చంద్రబాబుకానీ, ఆయన కొడుకు, భార్యకానీ ఆమెను పలకరించలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పారు. సొంత చెల్లిలిని చూడలేని వాడు రాష్ట్ర ప్రజలను ఎలా చూస్తాడో ప్రజలు అర్థం చేసుకోవచ్చన్నారు. లోకేష్ టెన్త్ పాస్ అవడనే భయంతో .. నారాయణ వాళ్లను పిలిచి చంద్రబాబు ఎలా పాస్ చేయించుకొన్నాడో తనకు తెలుసన్నారు. కేవలం టెన్త్‌లో పాస్ చేయించినందుకే... నారాయణకు చంద్రబాబు బాసట నిలిచి అంత ఉన్నతికి కారకుడయ్యాడన్నారు. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌కోసం కోఆపరేటివ్ డెయిరీలను మూయించారని విమర్శించారు. అమరావతిని ఏదో చేసేస్తానని చెబుతున్నాడని, కానీ అక్కడేమీ లేదన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ కావాలని ప్రధాని మోదీతో మాట్లాడి.. ఆ మేరకు లబ్ధి పొందారని, ఇప్పుడు మాటమార్చి మోదీని తిడుతున్నారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుపడింది చంద్రబాబేనన్నారు. అమరావతిని జగన్ మాత్రమే పూర్తి చేస్తారన్నారు. హైదరాబాద్‌లో 60 లక్షల మంది సెటిలర్లు ఉన్నారని, ఇక్కడున్న ఏపీ, తెలంగాణ వారంతా అన్నదమ్ముల్లాగా హాయిగా బతుకుతున్నారని నార్నె అన్నారు. హాయిగా ఉన్న తెలుగువారి మధ్య చిచ్చుపెట్టాలని బాబు చూస్తున్నాడన్నారు. చంద్రబాబును ఇంటికి పంపిస్తే అక్కడ ఏపీ ప్రజలు, ఇక్కడ తెలంగాణ ప్రజలు సుఖంగా ఉంటారన్నారు. -
చంద్రబాబుపై రామ్మూర్తినాయుడే గెలుస్తాడు..
-
లోకేశ్ టెన్త్ ఎలా పాస్ అయ్యాడో నాకు తెలుసు: నార్నే
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుని రాష్ట్రానికి అద్భుతమైన ముఖ్యమంత్రిని అందించబోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నార్నే శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వల్లే ఏపీలో అభివృద్ధి సాధ్యమన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు 650 హామీలు ఇచ్చి అట్టర్ ప్లాప్ అయ్యారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని నార్నే స్పష్టం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్ జగన్ బీసీలకు కూడా పెద్దపీట వేశారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్, వైఎస్సార్ మాదిరి సుపరిపాలన చేస్తారని అన్నారు. ‘చంద్రబాబు పచ్చి మోసగాడు. సొంత తమ్ముడికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మోసం చేశాడు. తమ్ముడిని గొలుసులతో కట్టేసి పిచ్చి పట్టేలా చేశాడు. దమ్ముంటే రామ్మూర్తినాయుడు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నాడో చూపించాలి. తమ్ముడి పరిస్థితి అలా కావడానికి బాబే కారణం. చంద్రగిరిలో ఓటింగ్ పెడితే చంద్రబాబు మీద రామ్మూర్తినాయుడే గెలుస్తాడు. అందుకే చంద్రబాబు తన మకాన్ని కుప్పానికి మార్చుకున్నాడు. అలాగే తిరుపతిలో చంద్రబాబు సొంత సోదరికి ప్రమాదం జరిగినా, ఇంతవరకూ ఆమెను ఎవరూ పరామర్శించలేదు. తోడబుట్టిన చెల్లిని చూడని చంద్రబాబు ఏపీ చెల్లెమ్మలను ఎలా చూసుకుంటాడు?. చంద్రబాబు స్వంత బలంతో ఏరోజూ ఎన్నికల్లో గెలవలేదు. ఇక తన సుపుత్రుడు లోకేశ్ పదో తరగతి పాస్ కావడానికి ఏం చేశాడో నాకు తెలుసు. లోకేశ్ పాసయ్యేందుకు మంత్రి నారాయణ ఎలా సహకరించాడో కూడా తెలుసు. అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు ఎంత ముట్టచెబుతున్నాడో కూడా తెలుసు. చంద్రబాబు తన పాల డెయిరీని నిలబెట్టుకోవడానికి మిగతావారిని ఎలా నాశనం చేశాడో తెలుసు. ఏపీ ప్రజలను కోరుకుంటున్న చంద్రబాబు నమ్మొద్దు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వ్యక్తి. మళ్లీ కాంగ్రెస్‌కే టీడీపీని తాకట్టు పెడతాడు. ఒకసారి ప్యాకేజీ అని, ఇంకోసారి ప్రత్యేక హోదా అని పూటకో మాట మారుస్తున్నాడు. అమరావతికి ఇచ్చిన డబ్బులు, ప్యాకేజీ ద్వారా వచ్చిన నిధులు వీటన్నింటిని చంద్రబాబు ఏం చేశాడు. రాజధానిలో కేవలం రెండు తాత్కాలిక భవనాలు కట్టాడు. ఇక ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా చంద్రబాబే స్వయంగా అడ్డుకున్నాడు. ఆయన ఒక కంపెనకీ మాత్రమే సీఈవో, నాయకుడు కాదు. చంద్రబాబు ప్రాంతీయతను రెచ్చగొట్టి కేసీఆర్‌ను తిట్టి ఓట్లు రాబట్టుకుందామని అనుకుంటున్నాడు. కానీ హైదరాబాద్‌లో సెటిలర్లు సంతోషం, ప్రశాంతంగా ఉన్నారో అందరికీ తెలుసు. ఇదే హైదరాబాద్‌లో చంద్రబాబు కూడా ఉంటున్నారు అనే విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది.’ అని నార్నే హితవు పలికారు. -
చంద్రబాబు మోసంతో రామ్మూర్తి కుంగిపోయారు
సాక్షి, అమరావతి : ‘స్వార్థానికి చంద్రబాబు పరాకాష్ట. సొంత తమ్ముడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు. చంద్రబాబును నమ్మి తమ్ముడు రామ్మూర్తి పిచ్చివాడైపోయాడు. ఆయనను తాళ్లతో కట్టి గదిలో బంధించింది వాస్తవం కాదా? టీడీపీలోకి వలసొచ్చిన బాబు ఈ రోజు ఆ పార్టీని కాంగ్రెస్‌కు తాకట్టుపెడుతున్నారు. ఆయన సీఎం అయ్యారంటే హరికృష్ణ దయవల్లే. అలాంటి కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారు. హరికృష్ణ కుమార్తెకు ఓడిపోయే సీటిచ్చి మోసగించారు. సుహాసినిని మంగళగిరిలో పోటీకి ఎందుకు నిలబెట్టలేదు. వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక కేసీఆర్, మోదీతో సంబంధాలు అంటగడుతూ ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. వైఎస్సార్ ప్రజల కోసం ఎంతో అద్భుతంగా పనిచేశారు. జగన్ కూడా అదేవిధంగా చేస్తారనే నమ్మకంతో వైఎస్సార్సీపీలో చేరా. జగన్‌ను సీఎం చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను’ అని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ, వైఎస్సార్సీపీ నాయకుడు నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పలు సంచలన విషయాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. తన ఎదుగుదల కోసం ఏదైనా చేస్తారు చంద్రబాబును చాలా ఏళ్లు దగ్గరనుంచి చూశాను. స్వార్థం తప్ప వేరే ఆలోచనే లేని ఆయన మనస్తత్వం నాకు తెలుసు. బాబు వల్ల రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగదు. 1998లో నన్ను పిలిచి చిలకలూరిపేట నుంచి పోటీ చేయమని చెప్పారు. ఆ రోజుల్లోనే రూ.కోటి ఖర్చుపెట్టి, రెండేళ్లు అక్కడే ఉండి కష్టపడ్డా. చివరి నిమిషంలో టికెట్ ఇవ్వలేదు. బంధువులు అభివృద్ధి చెందడాన్ని చంద్రబాబు సహించలేరు. తన ఎదుగుదల కోసం ఏదైనా చేస్తాడు. ఎవరికి ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా రెడీ. ఆయనొక మర్రిచెట్టు. తన కింద ఎవరినీ ఎదగనివ్వరు. అన్న మోసంతో రామ్మూర్తి కుంగిపోయారు చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు 1994లో అసెంబ్లీ టికెట్ కావాలని ఎన్టీఆర్‌ను అడిగారు. అయితే రామ్మూర్తికి టికెట్ ఇవ్వొద్దని ఎన్టీఆర్‌కు చంద్రబాబు చెప్పారు. దీంతో మనస్తాపం చెంది రామ్మూర్తి వెనక్కి వెళ్లిపోతే.. లక్ష్మీపార్వతీ పట్టుబట్టి ఆయనకు బీఫాం ఇప్పించారు. ఆ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి రామ్మూర్తి ఎమ్మెల్యే అయ్యారు. రామ్మూర్తికి అన్న చంద్రబాబు అంటే చాలా అభిమానం. అయితే 2004లో అన్న తనను మోసంచేసి టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా నిలబడి ఓడిపోయారు. అన్న మోసం చేయడంతో మతిస్థిమితం కోల్పోయారు. ఈ రోజు ఆయన దారుణమైన స్థితిలో ఉన్నారు. చంద్రబాబు ఎక్కడికెళ్లినా తమ్ముళ్లు అని అంటుంటారు. అయితే ఆయన సొంత తమ్ముడు ఎక్కడున్నారు? నీ తమ్ముడిని తాళ్లతో కట్టేసి రూంలో పడేయలేదా? రామ్మూర్తినాయుడు బాగానే ఉంటే బయటకు తీసుకొచ్చి చూపించమనండి. దాదాపు 7–8 ఏళ్లుగా రామ్మూర్తినాయుడు ఇదే పరిస్థితిలో ఉన్నారు. కేవలం అన్న చంద్రబాబును నమ్మి ఆయన పిచ్చివాడైపోయారు. తమ్ముడు నానా కష్టాలు పడి చంద్రబాబు ఖర్చులకు డబ్బులు పంపితే.. చివరకు ఆయనను ఈ స్థితికి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌కు టీడీపీని తాకట్టు పెడుతున్నారు టీడీపీకి చంద్రబాబు వలసొచ్చారు. కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టిన పార్టీ టీడీపీని అదే పార్టీకి తాకట్టుపెడుతున్నారు. అది భరించలేక ఈ రోజు బయటకొచ్చాను. చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని, జగన్‌ను గెలిపించాలని వైఎస్సార్సీపీలో చేరా. జగన్‌ను ఏపీ ప్రజలు తప్పకుండా సీఎంగా చూస్తారు. చంద్రబాబు తన అఫిడవిట్లో కుటుంబ ఆస్తులు రూ.700 కోట్లకు పైగా చూపించారు. అంత ఆస్తి ఉన్న ఆయనకు తమ్ముడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించే స్తోమత లేదా? ఈ రోజు చంద్రబాబు సీఎం అయ్యారంటే అది హరికృష్ణ భిక్ష. హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరావు, బాలకృష్ణ కలిసి సీఎం చేశారు. హరికృష్ణ కుటుంబాన్ని వాడుకుని వదిలేశారు. దగ్గుబాటి అప్పట్లో వేరే పార్టీ నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? వాడుకోవడం, వదిలేయడం చంద్రబాబు నైజం. నన్ను, జూ.ఎన్టీఆర్, హరికృష్ణను ఇలాగే వదిలేశారు. హైదరాబాద్ నువ్వు కట్టావా? హైదరాబాద్‌ను నేనే కట్టానని చంద్రబాబు పదేపదే చెపుతున్నారు. రాజధానిగా 70 ఏళ్ల హైదరాబాద్ చరిత్రలో చంద్రబాబు 8 ఏళ్లు మాత్రమే సీఎంగా ఉన్నారు. వైఎస్సార్ ఐదున్నరేళ్లకు పైగా, కేసీఆర్ దాదాపు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. ఎయిర్పోర్ట్, ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్ రింగ్‌రోడ్డు ఇలా ఎన్నో రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించారు. వేల మంది కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేస్తే హైటెక్ సిటీ, గచ్చిబౌలి నిర్మాణం జరిగింది. అందరు సీఎంలు కష్టపడితే ఈ రోజున్న హైదరాబాద్ తయారైంది. ఇప్పుడు అమరావతిని సింగపూర్ చేస్తానంటున్నావు. నువ్వు చెప్పిన పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కడ? నీ డబ్బా మీడియాతో ప్రచారం చేసుకుంటున్నావు. ఇంకో 20 ఏళ్లు అవకాశమిచ్చినా అమరావతిలో చంద్రబాబు ఏమీ చేయలేరు. మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మొదట ఓడిపోయే నియోజకవర్గం లోకేష్‌దే. అక్కడ ఆర్కే గెలవడం ఖాయం. మేము ఆ నియోజకవర్గంపై దృష్టిపెట్టాం. అక్కడ లోకేష్ విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు. ఐదేళ్లుగా ఆర్కే మంగళగిరి ప్రజలకు ఏం చేశారో అందరికీ తెలుసు. అంకితభావంతో ఆయన చేసిన పనులే గెలిపిస్తాయి. 8 ఏళ్లు జగన్ ప్రజల మధ్యే ఉన్నారు ఈ 10 ఏళ్లలో వైఎస్ జగన్ 8 ఏళ్లు జనం మధ్యే ఉన్నారు. ఆయన నెలకు 2, 3 రోజులే కుటుంబంతో గడిపారు. చంద్రబాబు ఇప్పుడు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఇస్తానంటూ పార్టీ నాయకులను మోసగించడం చంద్రబాబుకు చాలా సులభం. నాకు కూడా రాజ్యసభ ఇస్తానన్నారు. అలా దాదాపు 300 మందికి హామీనిచ్చారు. నేనైతే వద్దని చెప్పాను. ఎప్పుడూ సీఎంగా ఉండడమే చంద్రబాబు లక్ష్యం. కొడుకంటే పిచ్చి ప్రేమ. తన వారసుడిగా లోకేష్‌కు పట్టంగట్టడమే ఆయన టార్గెట్. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు చంద్రబాబును నమ్మారు. చివరకు వాళ్లకు చుక్కలు చూపించారు. సొంత తమ్ముడినే పట్టించుకోలేదు. ఇక బంధువులకు ఏం సాయం చేస్తారు. పదవే ఆయన బంధువు. నా కొడుకు, నేను బాగుండాలి అనే మనస్తత్వం చంద్రబాబుది. మోహన్ బాబు నోరు తెరిస్తే.. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కాలేజీ పిల్లలతో కలిసి మోహన్‌బాబు రోడ్డుపైకి వచ్చారు. టీడీపీ వాళ్లు ఆయనను బెదిరిస్తున్నారు. చంద్రబాబు, మోహన్‌బాబులది పక్క పక్క ఊర్లే. రామారావు దగ్గర చంద్రబాబు, లక్ష్మీ పార్వతి ఉన్నప్పుడు మోహన్ బాబు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో మొత్తం ఆయనకు తెలుసు. మోహన్‌బాబు నోరు తెరిస్తే బాబు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా దిక్కుతోచని పరిస్థితి. తిమ్మిని బమ్మిని చేయడంలో దిట్ట వై.ఎస్.వివేకానందరెడ్డి చనిపోయి ఆ కుటుంబం దుఃఖంలో ఉంటే చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. వాళ్ల కుటుంబంపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ పోలీసులపై నమ్మకం లేదని సీబీఐతో విచారణ చేయించాలని వివేకా కుమార్తె ఢిల్లీ వరకూ వెళ్లారు. అయితే బాబు మాత్రం తన ఎన్నికల ప్రచారంలో విషం కక్కుతున్నారు. ఆయన తిమ్మిని బమ్మిని చేసి సంబంధం లేని వారిపై నేరం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తానని చంద్రబాబు హామీనిచ్చారు. వారికి రూ. 40 వేలు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పుడు ఎన్నికల సమయంలో రూ. 5 వేలు ఇచ్చి మోసం చేస్తున్నారు. జగన్ నవరత్నాలు ప్రకటించాక.. భయంతో ఎన్నికలముందు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఐదేళ్ల క్రితం ఎన్నో చేస్తామని ఆయన పదవి ఎక్కారు. ఇప్పుడు నవరత్నాల్ని కాపీకొడుతున్నారు. కుల పిచ్చి, గజ్జి ఉంది చంద్రబాబుకే. వైఎస్ జగన్ చేసేదే చెబుతారు. అమలు చేయలేనివి అసలు చెప్పరు. చంద్రబాబు అన్ని చెబుతారు కానీ ఏమీ చేయరు. కేవలం వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికే పార్టీలోకి వచ్చా. దీని తర్వాత రాజకీయాల్లో కొనసాగను. జగన్‌ను ఎదుర్కోలేక కేసీఆర్ పేరును తెరపైకి తెస్తున్నారు వైఎస్సార్ అందరినీ తన కుటుంబం అనుకున్నారు. చంద్రబాబు మాత్రం ఎవరినీ తన కుటుంబంగా చూడలేరు. ఏపీ ప్రజల్ని తనవారిగా ఎప్పుడూ భావించలేదు. జగన్‌ను ఎదుర్కోలేక పక్క రాష్ట్రం సీఎం పేరును పదేపదే తెరపైకి తెస్తున్నారు. మోదీకి జగన్‌కు సంబంధముందని చెపుతున్నారు. నాలుగేళ్లు మోదీతో కలిసి కాపురం చేసింది ఎవరు.? కేసీఆర్ అనే పదం బూచిగా చూపి ఏపీ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయాలనుకుంటున్నారు. జనాల దగ్గర నుంచి ఓట్ల దండుకోవడానికి నాటకాలాడుతున్నారు. జనం చంద్రబాబును నమ్మరు. తెలంగాణలో 60 లక్షల మంది సెటిలర్లు ఉండగా.. ఎవరికైనా ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడిందా? ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారు.? హరికృష్ణ కుమార్తెకు అన్యాయం చేశారు హరికృష్ణకు అన్యాయం చేశారని అందరూ అనేసరికి.. ఆయన కుమార్తెను తీసుకొచ్చి ఓడిపోయే సీటులో కావాలనే నిలబెట్టారు. మంచి చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోనే టికెట్ ఇచ్చేవాడు కదా. హరికృష్ణపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆమెను మంగళగిరిలో నిలబెట్టవచ్చు కదా. నీ కొడుకునెందుకు నిలబెట్టాలి. సుహాసినికి హైదరాబాద్‌తో సంబంధం లేదు. ఆమె పెళ్లి చేసుకుని రాజమండ్రి వెళ్లిపోయింది. ఆమెకు ఆంధ్రలో సీటివ్వాలి కానీ హైదరాబాద్‌లో ఎందుకిచ్చారు. ఇవ్వన్నీ దొంగ ట్రిక్కులు. ఇలాంటివి చంద్రబాబు దగ్గర చాలా చూశా. -
కుటుంబ ద్రోహ చరిత్రలో బాబుదే రికార్డు
సభల్లో సమావేశాల్లో తరచూ తమ్ముళ్లూ, తమ్ముళ్లూ అంటూ సంబోధించే చంద్రబాబు తన సొంత తమ్ముడు ఎక్కడున్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుగు ప్రజలకు చెప్పగలడా అని జూనియర్ ఎన్టీఆర్ మామ, వైఎస్సార్సీపీ నాయకులు నార్నే శ్రీనివాసరావు ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. సొంత అన్న చంద్రబాబును రామ్మూర్తి ఎంతగానో ప్రేమించి, చాలీచాలని ఆదాయంతోనే ఖర్చులకు డబ్బు పంపించి ఆదుకుంటే అలాంటి తమ్ముడినే చంద్రబాబు నిలువునా ముంచేశారని వాపోయారు. సొంత తమ్ముడైన తనకు అసెంబ్లీ టికెట్ విషయంలో బాబు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక రామ్మూర్తి నాయుడు మతిస్థిమితం కోల్పోయారని, ఈరోజు గొలుసులు, తాళ్లతో కట్టేసి అతన్ని ఒక రూములో బంధించి ఉంచుతున్నారని నార్నే అరోపించారు. రాష్ట్రం మొత్తాన్ని తమ కుటుంబంగా భావించి సేవ చేసిన, చేస్తున్న చరిత్ర వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డిలది కాగా సొంత బంధువులను శంకరగిరి మాన్యాలకు పంపించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. వైఎస్ జగన్‌ని ఏపీ సీఎంగా చేయాలన్నదే తన ఆకాంక్ష అని అది నెరవేరాక రాజకీయాల్లోనే ఉండనంటున్న నార్నే శ్రీనివాసరావు అభిప్రాయం ఆయన మాటల్లోనే... మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే సంచలనం కదా? వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు అద్భుతమైన సేవ చేశారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి సేవే చేస్తారని నా నమ్మకం. చంద్రబాబును నేను చాలా దగ్గరగా చూశాను. తన మెంటాలిటీ ఏదో నాకు తెలుసు. స్వార్థం తప్ప మరో ఆలోచనే లేదాయనకి. తాను తన కొడుకు తప్ప మరెవరూ కనపడరు ఆయనకు. చంద్రబాబుతో చాలాకాలం కలిసున్నారు. ఎక్కడ తేడా వచ్చింది మీకు? 1998లోనే చంద్రబాబు పిలిచి చిలకలూరి పేట అసెంబ్లీ స్థానం ఇస్తాను. ప్రచారం చేసుకోండి అని చెబితే నమ్మి కోటిరూపాయలు పైగా ఖర్చుపెట్టి రెండేళ్లపాటు స్వంతంగా ప్రచారం చేశాను. చివరిదాకా సీటు నాకే అని చెప్పి నమ్మకద్రోహం చేసి మరొకరికి ఆ సీటు ఇచ్చారు. ఆరోజే చంద్రబాబు వ్యవహారం ఏమిటో అర్థమైపోయింది. సొంత బంధువులు ఎవరూ ఒక పొజిషన్లో ఉండటం బాబుకు ఇష్టముండదు. నూటికి నూరు శాతం ఇది నిజం. మరి చంద్రబాబు తమ్ముడు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు 1994లో రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్ దగ్గర టికెట్ కోసం పోరాడితే, బాబు ఇవ్వొద్దని అడ్డుకున్నారు. అప్పుడు లక్ష్మీపార్వతి దగ్గరుండి రామ్మూర్తికి టికెట్ ఇప్పించి పంపిస్తేనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అదే రామ్మూర్తి నాయుడికి మరోసారి బాబు మోసం చేసి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా నిలబడి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. రామ్మూర్తి నాయుడు, బాబు సెట్ అవ్వకముందు కష్టపడి ఖర్చుల కోసం అతనికి డబ్బులు పంపించేవారు. అన్నను ఎంతగానో ప్రేమిస్తే, టికెట్ విషయంలో చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక రామ్మూర్తి నాయుడు మతిస్థిమితం కోల్పోయారు. చంద్రబాబు తమ్ముడు ఇప్పుడు ఎలా ఉన్నారో మీకు తెలుసా? రామ్మూర్తి నాయుడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ తెలియదు. ఆయన పరిస్థితి ఈరోజు దారుణంగా ఉంది. చంద్రబాబు మైక్ తీసుకుంటే తమ్ముళ్లూ, నా తమ్ముళ్లూ అంటూ పాట పాడుతుంటారు. కానీ ఆయన సొంత తమ్ముడు ఎక్కడున్నాడో తెలుసా? ఈ రోజు గొలుసులు, తాళ్లతో కట్టేసి అతన్ని ఒక రూములో బంధించి ఉంచుతున్నారు. దమ్ముంటే సొంత తమ్ముడిని బయటికి తీసుకువచ్చి చూపిం చమనండి. అన్న మీద గుడ్డి నమ్మకంతో అన్నీ చేసిన తర్వాత మోసం చేయడంతో మతిస్థిమితం లేకుండా అయిపోయారు. చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల అఫిడవిట్లో కూడా తనకు కోట్లకొద్ది ఆస్తులున్నట్టు పేర్కొన్నాడు. నారాలోకేష్కి అయితే 300 కోట్లు ఆస్తి ఉన్నట్లు చూపించారు కదా. అలాంటిది సొంత తమ్ముడిని తీసుకెళ్లి ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించే స్తోమత బాబుకు లేదా? సొంత తమ్ముడిని తాళ్లతో బంధించి దాచి ఉంచే ఖర్మ ఎందుకండీ? రామ్మూర్తినాయుడు పరిస్థితి అంత దీనంగా ఉందా.. ఎప్పటినుంచి? ఈ విషయం బోధపడాలంటే మనం 1990లు 80ల ముందుకు వెళ్లాలి. రామ్మూర్తి అప్పట్లో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ అయిదువేలు పదివేల రూపాయలు సంపాదించుకుంటూ దాంట్లోంచి చంద్రబాబుకు ఖర్చులకు డబ్బు పంపిస్తూ ఉండేవాడు. ఇన్ని కష్టాలు పడి చంద్రబాబును ఈ స్థితికి తీసుకొస్తే సొంత తమ్ముడికి అన్యాయం చేసి, టికెట్ ఇవ్వకుండా వేధించాడు బాబు. అన్నను నమ్ముకున్న ఏ తమ్ముడు కూడా రామ్మూర్తి అంత దారుణంగా దెబ్బతిని ఉండడు. మొదటినుంచి తన తమ్ముడి విషయంలో బాబు అలాగే ఉండేవారా? బంధువు అనేవాడిని ఎవరినీ దగ్గర ఉండనివ్వడు చంద్రబాబు. ఆరోజు బాబు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడంటేనే దానికి కారణం హరికృష్ణ వేసిన భిక్ష. ఆయన, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ కలిసి వత్తాసు ఇస్తేనే సీఎం అయ్యాడు బాబు. అలాంటి హరికృష్ణను తర్వాత ఏం చేశాడో తెలుసు కదండి. మంత్రిపదవి ఇచ్చి ఆరునెలల్లో ఇంటికి పంపించేశాడు. ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. దగ్గుబాటి టీడీపీనే వదలి వేరే పార్టీల్లో చేరాల్సిన స్థితికి బాబే కారణం కదా. 1983 నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న దగ్గుబాటిని ఎక్కడికి పంపించాడు బాబు? పురంధేశ్వరి వేరే పార్టీని వెతుక్కుంటూ పోవాల్సిన ఖర్మ ఏం పట్టిందండీ? బాబు లేకపోతే తెలుగుదేశం పార్టీ బాగుండేది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వలసొచ్చి ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. అతని ఎదుగుదల కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతాడు. దేనికైనా సిద్ధపడతాడు. మనుషులని వాడుకుని, వదిలేయడం అతని నైజం. బాబు ఒక మర్రి చెట్టులాంటివాడు. అతను ఎదుగుతాడు. మర్రిచెట్టు కింద గడ్డిపోచను కూడా మొలవనివ్వడు. చంద్రబాబుకు, వైఎస్ రాజశేఖరరెడ్డికి తేడా ఏమిటి? రాజశేఖరరెడ్డి అందరూ తన కుటుంబం అనుకుంటారు. కుటుంబం బాగోగులను చూసేవారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా తన కుటుం బంలాగే భావించుకుని అందరి మేలూ చూసేవారు. అదే చంద్రబాబు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నా వాళ్లు అని ఏరోజూ అనుకోలేదు. రోజుకు ఒక అబద్ధమాడతాడు. రోజుకు ఒక ట్విస్ట్ ఇస్తాడు. మోహన్‌బాబు కూడా ఈరోజు బాబుపై తిరగబడుతున్నారు కదా? నిన్నకాక మొన్న పిల్లలతో కలిసి మోహన్ బాబు రోడ్డుపైకి వచ్చారు. టీడీపీ వాళ్లు మోహన్ బాబును బెదిరిస్తున్నారు. చంద్రబాబుది, మోహన్ బాబుది పక్క పక్క ఊర్లే. రామారావు దగ్గర బాబు, లక్ష్మీపార్వతి ఉన్నప్పుడు మోహన్ బాబు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో ఏమేం జరిగిందో మొత్తం మోహన్ బాబుకు తెలుసు. ఒక వేళ మోహన్ బాబు నోరు తెరిస్తే బాబుకు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా దిక్కుతోచని పరిస్థితి. హరికృష్ణ కుమార్తెకి మొన్న తెలంగాణ ఎన్నికల్లో సీటిచ్చారు కదా? హరికృష్ణ్ణకు అన్యాయం చేసాడని అందరూ అనేసరికి.. హరికృష్ణ కూతురు సుహాసినికి న్యాయం చేస్తున్నానని చెప్పి, ఆమెను తీసుకొచ్చి ఓడిపోయే కూకట్పల్లి సీటిచ్చారు. రాజమండ్రిలో నివసిస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో పోటీకి నిలుచోబెట్టడం ఏంటి? మంచి చేయాలనుకుంటే ఏపీలోనే టికెట్ ఇచ్చేవాడు కదా. ఇవన్నీ దొంగ ట్రిక్కులు. తన పోటీ వైఎస్ జగన్‌తో కాదు కేసీఆర్‌తో అంటున్నారు బాబు? చంద్రబాబు ఈరోజు వైఎస్ జగన్‌తో పోటీపడలేక, ఆయన్ని ఎదుర్కోలేక, ఆయన పేరెత్తలేక, తనతో ఎన్నికల ఫైట్ చేయలేక పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్ పేరు ఎందుకు తెస్తున్నాడు? ప్రధాని పేరు ఎందుకు తీసుకొస్తున్నాడు? ఈరోజు మోదీ ఏం చేయలేదు అంటున్నాడు సరే. మరి నాలుగేళ్లు మోదీతో కాపురం చేసింది చంద్రబాబా లేక జగనా? కేసీఆర్‌తో కానీ, మోదీతో కానీ ఈ మధ్యకాలంలో జగన్ ఎన్నడైనా కలి శారా? ఏపీ ఎన్నికల గురించి ఎన్నడైనా వారితో మాట్లాడారా? కేసీఆర్ అనే బూచిని చూపి ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులను చేయడమే చంద్రబాబు ఉద్దేశం. జనాల దగ్గర ఓట్లు పిండుకునే నాటకం కాదా ఇది. ఏపీలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరు తెలంగాణలో బతుకుతున్నారు. తెలంగాణలో మూడుకోట్ల మంది ఓటర్లుంటే 60 లక్షలమంది ఆంధ్రనుంచి వచ్చినవారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ, నా ఫ్యామిలీ.. మీ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఏపీనుంచి వచ్చిన సెటిలర్లే. ఎవరికైనా ఇంతవరకు ఒక చిన్న ఇబ్బంది కలిగిందా హైదరాబాద్‌లో? మూలాన్నే వదిలి మీరు వైఎస్ జగన్ వద్దకు వచ్చారు కారణం? ఇన్నేళ్లుగా చంద్రబాబును చాలా సన్నిహితంగా చూశాను కాబట్టి తన తత్వం ఏమిటో నాకు తెలుసు. ఇచ్చిన మాటకు కట్టుబడడు. బంధువులనైతే అసలు నమ్మడు, ఎవరినీ ఎదగనివ్వడు. మాట మాట్లాడితే విలువల విధ్వంసం అంటుంటాడు. కానీ, కుటుంబ విలువలను నిలువునా ధ్వంసం చేయడంలో చంద్రబాబును మించిన ఘనాపాటి ఎవరూ ఉండరు. నాతోపాటూ మరో 300 మందికి రాజ్యసభ సీటిస్తా అని హామీ ఇచ్చి దగా చేశాడు. చంద్రబాబును ఎన్నో ఏళ్లుగా పక్కనుంచే చూశా. కుల పిచ్చి, గజ్జి ఉంది చంద్రబాబునాయుడుకే. వైఎస్ జగన్ చేసేదే చెబుతారు. అమలు చెయ్యలేనివి అస్సలు చెప్పరు. చంద్రబాబు అన్ని చెబుతాడు. ఏమీ చేయడు. పాలనలో తండ్రిని మించిన తనయుడు వైఎస్ జగన్ అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం మేలు జరగాలన్నా ఈసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి అనే ఒకే ఒక ఆలోచనతో నేను వైఎస్సార్సీపీలోకి వచ్చాను. మీరు ఎక్కడ నిలబడినా సీటు ఇస్తామని చెప్పినా వద్దన్నాను. వైఎస్ జగన్‌ని సీఎంగా చూడాలనే ఉద్దేశంతోటే ఇందులోకి వచ్చాను. దీనితర్వాత నేను రాజకీయాల్లో కొనసాగను. నూటికి నూరుపాళ్లు ఇది నిజం. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2OsAouz https://bit.ly/2Wr9JRz -
‘సొంత తమ్ముడి మతిభ్రమించడానికి చంద్రబాబే కారణం’
జూనియర్ ఎన్టీఆర్ మామ వైఎస్సార్సీపీ నాయకులు నార్నె శ్రీనివాసరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. సభల్లో సమావేశాల్లో తరుచూ తమ్ముళ్లూ, తమ్ముళ్లూ అంటూ సంభోదించే చంద్రబాబు తన సొంత తమ్ముడు ఎక్కడున్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుగు ప్రజలకు చెప్పగలడా అని సాక్షి టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సవాలు విసిరారు. చంద్రబాబు తమ్ముడు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు 1994లో రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్ దగ్గర టికెట్ కోసం పోరాడితే, చంద్రబాబు ఇవ్వొద్దని అడ్డుకున్నారు. అప్పుడు లక్ష్మీ పార్వతి దగ్గరుండి రామ్మూర్తినాయుడికి టికెట్ ఇప్పించి పంపిస్తేనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అదే రామ్మూర్తి నాయుడికి మరోసారి చంద్రబాబు మోసం చేసి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా నిలబడి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు సెట్అవ్వకముందు కష్టపడి ఖర్చుల కోసం అతనికి డబ్బులు పంపించేవారు. అన్నను ఎంతగానో ప్రేమిస్తే, టికెట్ విషయంలో చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక రామ్మూర్తి నాయుడు మతిస్థిమితం కోల్పోయారు. రామ్మూర్తి నాయుడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ తెలియదు. ఈ రోజు గొలుసులు, తాళ్లతో కట్టేసి అతన్ని ఒక రూములో బంధించి పెడుతున్నారు. దమ్ముంటే సొంత తమ్ముడిని బయటికి తీసుకువచ్చి చూపించమనండి. అన్న మీద గుడ్డి నమ్మకంతో అన్నీ చేసిన తర్వాత మోసం చేయడంతో మతిస్థిమితం లేకుండా అయిపోయారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇటీవల ఎన్నికల అఫిడవిట్లో కూడా కోట్లకొద్ది ఆస్తులున్నట్టు పేర్కొన్నాడు. అలాంటింది సొంత తమ్ముడిని తీసుకెళ్లి ఓ ఆసుపత్రిలో చికిత్స చేపించలేడా. చంద్రబాబు ఒక మర్రి చెట్టులాంటివాడు. అతను ఎదుగుతాడు. మర్రిచెట్టు కింద గడ్డిపోచను కూడా మొలవనివ్వడు. చంద్రబాబు ఎదుగుదల కోసం దేనికైనా సిద్ధపడుతాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడుది కాదు. హరిక్రిష్ణ పెట్టిన భిక్షవల్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. హరిక్రిష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వర్లు పక్కనుండి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడితే ఆ తర్వాత వారు ఎక్కడున్నారు. చంద్రబాబు నాయుడు వలస వచ్చినవాడు. చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం పార్టీ బాగుండేది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వలసొచ్చి ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. అతని ఎదుగుదల కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతాడు. దేనికైనా సిద్ధపడుతాడు. మనుషులని వాడుకుని, వదిలేయడం అతని నైజం. మోహన్ బాబు నోరు తెరిస్తే.. నిన్నకాక మొన్న పిల్లలతో కలిసి మోహన్ బాబు రోడ్డుపైకి వచ్చారు. టీడీపీ వాళ్లు మోహన్ బాబును బెదిరిస్తున్నారు. చంద్రబాబుది, మోహన్ బుబుది పక్క పక్క ఊర్లే. రామారావు దగ్గర చంద్రబాబు, లక్ష్మీ పార్వతి ఉన్నప్పుడు మోహన్ బాబు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో ఏమేం జరిగిందో మొత్తం మోహన్ బాబుకు తెలుసు. ఒక వేళ మోహన్ బాబు నోరు తెరిస్తే బాబు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా దిక్కుతోచని పరిస్థితిలోకి వెళతాడు. చంద్రబాబువి అన్నీ దొంగ ట్రిక్కులు హరిక్రిష్ణకు అన్యాయం చేసాడని అందరూ అనే సరికి.. హరిక్రిష్ణ కూతురు సుహాసికి న్యాయం చేస్తున్నానని చెప్పి, ఆమెను తీసుకొచ్చి ఓడిపోయే కూకట్పల్లి సీటిచ్చారు. రాజమండ్రిలో నివసిస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో పోటికి నిలుచోబెట్టడం ఏంటి? మంచి చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోనే టికెట్ ఇచ్చేవాడు కదా. ఇవ్వన్నీ దొంగ ట్రిక్కులు. ఇటువంటివి చంద్రబాబు దగ్గర చాలా చూశా. 1998లోనే హ్యాండిచ్చాడు.. 1998లోనే చంద్రబాబు నాయుడు నన్ను పిలిచి చిలుకలూరి పేట టికెట్ ఇస్తా అని చెప్పాడు. దీంతో అక్కడే రెండేళ్ల పాటూ ఉండి దాదాపు కోటి రూపాయలు ఖర్చు కూడా చేశా. చివరి నిమిషంలో టికెట్ వేరే వ్యక్తికి ఇచ్చాడు. బంధువులను ఎవరినీ ఎదగనివ్వడు. నాతోపాటూ మరో 300 మందికి రాజ్యసభ సీటిస్తా అని హామీ ఇచ్చాడు. చంద్రబాబును ఎన్నో ఏళ్లుగా పక్కనుంచే చూశా. కుల పిచ్చి, గజ్జి ఉంది చంద్రబాబునాయుడుకే. వైఎస్ జగన్ చేసేదే చెబుతారు. అమలు చెయ్యలేనివి అస్సలు చెప్పరు. చంద్రబాబు అన్ని చెబుతాడు. ఏమీ చేయడు. పాలనలో తండ్రిని మించిన తనయుడు వైఎస్ జగన్ అవుతారు. కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికే పార్టీలోకి వచ్చా. దీని తర్వాత రాజకీయాల్లో కొనసాగను. -
జూ. ఎన్టీఆర్ మామకు కీలక పదవి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామయ్య (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నే శ్రీనివాసరావుకు కీలక పదవి దక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు దగ్గుబాటి హితేష్ కూడా వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నార్నె శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి 28న ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి తాను ఆ కుటుంబానికి మద్దతుదారుడిగా ఉన్నానని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు పాలన బాగా లేదని వ్యాఖ్యానించారు. చదవండి: వైఎస్సార్ సీపీలో చేరిన నార్నే శ్రీనివాసరావు -
వైఎస్సార్ సీపీలో చేరిన నార్నే శ్రీనివాసరావు
-
వైఎస్సార్ సీపీలోకి జూ.ఎన్టీఆర్ మామయ్య
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగేలా షాక్‌లు మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు టీడీపీ నేతలు వరుసపెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. పార్టీపరంగా ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరోవైపు బంధువర్గం నుంచి కూడా చంద్రబాబుకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీ రామారావు పెద్దల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు దగ్గుబాటి హితేష్ వైఎస్సార్ సీపీలో చేరారు. (వైఎస్సార్ సీపీలో చేరిన కిల్లి కృపారాణి) తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామయ్య (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నే శ్రీనివాసరావు గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా నార్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఏపీలో చంద్రబాబు పాలన సరిగా లేదు. వైఎస్ జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే పార్టీలో చేరాను. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో నాకు పదేళ్ల నుంచి అనుబంధం ఉంది. నేను వైఎస్సార్ సీపీలో చేరడానికి... జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో, లేదో తెలియదు. అయితే పార్టీ గెలుపుకు నా వంతు కృషి చేస్తాను. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యమ’ని తెలిపారు. కాగా చంద్రబాబు నాయుడుకు దగ్గర బంధువు అయిన నార్నే శ్రీనివాసరావు (నార్నే శ్రీనివాసరావు భార్య చంద్రబాబుకు స్వయాన మేనకోడలు) వైఎస్సార్ సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్-లక్ష్మీప్రణతి వివాహానికి చంద్రబాబే పెళ్లిపెద్దగా వ్యవహరించారు కూడా. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు... ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని... మహాకూటమి తరఫున కూకట్పల్లి నుంచి పోటీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసినా... వాళ్లు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పటికే ఈ పరిణామాలను చంద్రబాబు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు... బంధువర్గం నుంచి గట్టి దెబ్బే తలిగిందని చెప్పుకోవచ్చు.