మంత్రి నారా లోకేశ్ మంగళగిరి పేరును అమంగళం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నార్నే శ్రీనివాసరావు విమర్శించారు. లోకేశ్ కోసం కోపరేటివ్ సంస్థలన్నింటినీ చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు ముగిసేవరకు వైఎస్సార్‌సీసీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మూడు రోజుల్లో చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నుతారని వ్యాఖ్యానించారు.