
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామయ్య (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నే శ్రీనివాసరావుకు కీలక పదవి దక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు దగ్గుబాటి హితేష్ కూడా వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే.
ఈసారి ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నార్నె శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి 28న ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్ జగన్ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి తాను ఆ కుటుంబానికి మద్దతుదారుడిగా ఉన్నానని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు పాలన బాగా లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment