
ఢిల్లీ శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కల్యాణం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆదివారం శ్రీనివాస కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆదివారం శ్రీనివాస కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఢిల్లీలోని గోల్ మార్కెట్ ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయ తొలి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దీనిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీ టీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా దేశంలోని చిన్న పట్టణాలు, నగరాలు, మెట్రో నగరాలతోపాటు విదేశాల్లోనూ స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. రాజధానిలో జరిగిన కల్యాణోత్సవానికి ఢిల్లీ వాసులు పెద్ద సంఖ్యలో రావడం ఆనందంగా ఉందని తెలిపారు.