- నేడు ‘గాడ్’ జన్మదిన వేడుకలు
నేత్రపర్వంగా శ్రీనివాస కల్యాణం
Published Wed, Jan 18 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
రాయవరం (మండపేట) :
మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం(గాడ్) జన్మదిన వేడుకల్లో భాగంగా రెండో రోజు బుధవారం పీఠం కల్యాణ శోభను సంతరించుకుంది. పీఠంలోని విజయదుర్గా అమ్మవారిని నయనానందకరంగా అలంకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పీఠానికి అందజేసిన శ్రీదేవి, భూదేవి సమేత విజయవేంకటేశ్వరస్వామి వారి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. పీఠం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉత్సవ విగ్రహాలకు పీఠాధిపతి గాడ్ సమక్షంలో శ్రీనివాసమంగాపురం దేవాలయ ప్రధాన అర్చకులు బాలాజీ ఆధ్వర్యంలో వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి తులసి దళాలతో అర్చనలు చేశారు. అనంతరం తిరుమల వైఖానస పండితులతో శ్రీవారి దివ్య కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు, హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్ కో ఆర్డినేటర్ కందర్ప హనుమా¯ŒS తదితరులు పాల్గొన్నారు. పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.
నేడు పలువురు ప్రముఖుల రాక
‘గాడ్’ జన్మదిన వేడుకలకు పలువురు ప్రముఖులు గురువారం పీఠానికి రానున్నారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్, బ్రాహ్మణ, అర్చక సంక్షేమ సంఘం చైర్మ¯ŒS ఐవైఆర్ కృష్ణారావు, పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మ¯ŒS రావులపాటి సీతారామారావు, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర క్రీడలు, యువజన శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఆధ్యాత్మిక, సాహితీవేత్తలు హాజరుకానున్నారు.
Advertisement