‘గాడ్‌’ జన్మదిన వేడుకలకు పీఠం ముస్తాబు | god birth day selebrations | Sakshi
Sakshi News home page

‘గాడ్‌’ జన్మదిన వేడుకలకు పీఠం ముస్తాబు

Jan 16 2017 9:14 PM | Updated on Sep 5 2017 1:21 AM

వెదురుపాక విజయదుర్గా పీఠాదిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్‌) 81వ జన్మదిన వేడుకలకు పీఠం ముస్తాబైంది. గాడ్‌ జన్మదిన వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పీఠం పీఠం అడ్మినిస్ట్రేటర్‌ వి.వి.బాపిరాజు, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్‌(బాబి)

  • నేటి నుంచి పీఠంలో పూజలు ప్రారంభం   
  • 19న పీఠానికి ప్రముఖుల రాక
  • వెదురుపాక(రాయవరం) :
    వెదురుపాక విజయదుర్గా పీఠాదిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్‌) 81వ జన్మదిన వేడుకలకు పీఠం ముస్తాబైంది. గాడ్‌ జన్మదిన వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పీఠం పీఠం అడ్మినిస్ట్రేటర్‌ వి.వి.బాపిరాజు, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్‌(బాబి) సోమవారం విలేకరులకు తెలిపారు.  మంగళవారం ఉదయం ఉదయం 11.05 గంటలకు జ్యోతి ప్రజ్వలన, గోపూజ, లక్షీ్మగణపతి హోమంతో మూడు రోజుల పాటు జన్మదిన వేడుకలు ప్రారంభం కానున్నాయి. 
    నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు..
    గాడ్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భక్తజన సంక్షోభ నివారణార్థం పీఠంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పలు ఆధ్మాతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా మంగళవారం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం పండితులు శ్రీసుబ్రహ్మణ్య త్రిశతి హోమం, సాయంత్రం ఆరు గంటలకు అన్నవరం శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పండితులు స్వామి వారి దివ్యకల్యాణం, 18న ఉదయం 9గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత విజయవేంకటేశ్వరస్వామి వారి దివ్య కల్యాణం తిరుమల వైఖానస పండితులు నిర్వహించనున్నట్టు తెలిపారు.
    19న పీఠానికి ప్రముఖుల రాక...
    19న గాడ్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పీఠంలోని  విజయవేంకటేశ్వరస్వామి, వల్లీదేవసేససమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వరసిద్ధి వినాయకుడు, భవానీ శంకరుడు, శ్రీరామచంద్రమూర్తి, శ్రీవిజయదుర్గాదేవి ఉత్సవ మూర్తులకు పుష్పయాగం, హారతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గాడ్‌ జన్మదిన వేడుకలకు బ్రాహ్మణ, అర్చక సంక్షేమ సంఘం ఛైర్మ¯ŒS ఐవైఆర్‌ కృష్ణారావు, పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మ¯ŒS రావులపాటి సీతారామారావు, తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి, రాష్ట్ర క్రీడలు, యువజన శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం తదితరులు ప్రముఖులతో పాటు పలువురు ఆధ్యాత్మిక, సాహితీవేత్తలు హాజరుకానున్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement