god birth day
-
నేత్రపర్వంగా శ్రీనివాస కల్యాణం
నేడు ‘గాడ్’ జన్మదిన వేడుకలు రాయవరం (మండపేట) : మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం(గాడ్) జన్మదిన వేడుకల్లో భాగంగా రెండో రోజు బుధవారం పీఠం కల్యాణ శోభను సంతరించుకుంది. పీఠంలోని విజయదుర్గా అమ్మవారిని నయనానందకరంగా అలంకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పీఠానికి అందజేసిన శ్రీదేవి, భూదేవి సమేత విజయవేంకటేశ్వరస్వామి వారి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. పీఠం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉత్సవ విగ్రహాలకు పీఠాధిపతి గాడ్ సమక్షంలో శ్రీనివాసమంగాపురం దేవాలయ ప్రధాన అర్చకులు బాలాజీ ఆధ్వర్యంలో వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి తులసి దళాలతో అర్చనలు చేశారు. అనంతరం తిరుమల వైఖానస పండితులతో శ్రీవారి దివ్య కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు, హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్ కో ఆర్డినేటర్ కందర్ప హనుమా¯ŒS తదితరులు పాల్గొన్నారు. పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. నేడు పలువురు ప్రముఖుల రాక ‘గాడ్’ జన్మదిన వేడుకలకు పలువురు ప్రముఖులు గురువారం పీఠానికి రానున్నారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్, బ్రాహ్మణ, అర్చక సంక్షేమ సంఘం చైర్మ¯ŒS ఐవైఆర్ కృష్ణారావు, పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మ¯ŒS రావులపాటి సీతారామారావు, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర క్రీడలు, యువజన శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఆధ్యాత్మిక, సాహితీవేత్తలు హాజరుకానున్నారు. -
ఘనంగా ‘గాడ్’ జన్మదిన వేడుకలు
రాయవరం (మండపేట) : మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) 81వ జన్మదిన వేడుకలు మంగళవారం పీఠంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గాడ్ సతీమణి సీతమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి పూజలను ప్రారంభించారు. ఇక్కడి విజయదుర్గా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేదపండితులు గణపతి హోమం, గరిక పూజ, బిల్వపత్ర పూజ, నక్షత్ర జపం, నవగ్రహ పూజ, ఏకవార రుద్రాభిషేకంతో మహా మృత్యుంజయ హోమం, మన్యుసూక్త పారాయణ నిర్వహించారు. విజయదుర్గా అమ్మవారిని పలు రకాలుగా పూజించారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. నేత్రపర్వంగా సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణం గాడ్ జన్మదిన వేడుకల్లో భాగంగా తమిళనాడులోని తిరుత్తణి దేవస్థానం పండితులచే శ్రీవల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణాన్ని పీఠంలో నిర్వహించారు. స్వామివారికి, అమ్మ వార్లకు గురుకుల్ సంపత్, గోపిల ఆధ్వర్యంలో వేదపండితులు శాస్రో్తక్తంగా కల్యాణాన్ని జరిపించారు. అలాగే శ్రీసుబ్రహ్మణ్య త్రిశతి హోమం, శతాభిషేకం నిర్వహించారు. ఎండు ద్రాక్ష, ఖర్జూరం, జీడిపప్పు, వివిధ రకాల ద్రవ్యాలతో హోమం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి అసోసియేట్ రీజనల్ కో ఆర్డినేటర్ కందర్ప హనుమాన్, సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు, ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మ¯ŒS సత్తి బులిస్వామిరెడ్డి, సర్పంచ్ సూర్యబ్రహ్మానందరెడ్డి పలువురు మహిళలు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు పీఠంలో అన్నసమారాధన నిర్వహించారు. -
‘గాడ్’ జన్మదిన వేడుకలకు పీఠం ముస్తాబు
నేటి నుంచి పీఠంలో పూజలు ప్రారంభం 19న పీఠానికి ప్రముఖుల రాక వెదురుపాక(రాయవరం) : వెదురుపాక విజయదుర్గా పీఠాదిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) 81వ జన్మదిన వేడుకలకు పీఠం ముస్తాబైంది. గాడ్ జన్మదిన వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పీఠం పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) సోమవారం విలేకరులకు తెలిపారు. మంగళవారం ఉదయం ఉదయం 11.05 గంటలకు జ్యోతి ప్రజ్వలన, గోపూజ, లక్షీ్మగణపతి హోమంతో మూడు రోజుల పాటు జన్మదిన వేడుకలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు.. గాడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భక్తజన సంక్షోభ నివారణార్థం పీఠంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పలు ఆధ్మాతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా మంగళవారం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం పండితులు శ్రీసుబ్రహ్మణ్య త్రిశతి హోమం, సాయంత్రం ఆరు గంటలకు అన్నవరం శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పండితులు స్వామి వారి దివ్యకల్యాణం, 18న ఉదయం 9గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత విజయవేంకటేశ్వరస్వామి వారి దివ్య కల్యాణం తిరుమల వైఖానస పండితులు నిర్వహించనున్నట్టు తెలిపారు. 19న పీఠానికి ప్రముఖుల రాక... 19న గాడ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పీఠంలోని విజయవేంకటేశ్వరస్వామి, వల్లీదేవసేససమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వరసిద్ధి వినాయకుడు, భవానీ శంకరుడు, శ్రీరామచంద్రమూర్తి, శ్రీవిజయదుర్గాదేవి ఉత్సవ మూర్తులకు పుష్పయాగం, హారతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గాడ్ జన్మదిన వేడుకలకు బ్రాహ్మణ, అర్చక సంక్షేమ సంఘం ఛైర్మ¯ŒS ఐవైఆర్ కృష్ణారావు, పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మ¯ŒS రావులపాటి సీతారామారావు, తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి, రాష్ట్ర క్రీడలు, యువజన శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు ప్రముఖులతో పాటు పలువురు ఆధ్యాత్మిక, సాహితీవేత్తలు హాజరుకానున్నారు.