అఫీషియల్ : శ్రీనివాస కళ్యాణం నితిన్ తోనే..! | Dil raju Srinivasa kalyanam Hero nithin | Sakshi
Sakshi News home page

అఫీషియల్ : శ్రీనివాస కళ్యాణం నితిన్ తోనే..!

Published Sat, Nov 25 2017 3:22 PM | Last Updated on Sat, Nov 25 2017 3:22 PM

Dil raju Srinivasa kalyanam Hero nithin - Sakshi

దిల్ రాజు నిర్మాణం లో శ్రీనివాస కళ్యాణం సినిమా తెరకెక్కనుందన్న ప్రచారం చాలా రోజులుగా వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమాను నాగార్జున హీరోగా తెరకెక్కిస్తారని భావించారు. తరువాత ఎన్టీఆర్ హీరోగా శ్రీనివాస కళ్యాణం ప్రారంభిస్తారన్న ప్రచారం జరిగింది. శతమానం భవతి లాంటి సూపర్ హిట్ తరువాత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కావటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఫైనల్ గా ఈ సినిమాను నితిన్ హీరోగా తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్న నితిన్, ఆ సినిమా పూర్తయిన వెంటనే శ్రీనివాస కళ్యాణం సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందించనున్నాడు. 2018 మార్చిలో ప్రారంభం కానున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement