
కల్యాణం కోసం హీరో నితిన్ ఈ రోజు పంజాబ్‌లోని పటియాలాకి వెళ్లారు. ఈ రోజు అంటున్నారు మరి.. నిన్న ఎక్కడ ఉన్నారు? అంటే చండీఘడ్‌లో ఉన్నారు. ఎందుకు? అంటే.. శ్రీనివాస కల్యాణం కోసం. నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘శ్రీనివాస కల్యాణం’.
ఇందులో రాశీఖన్నా, నందితా శ్వేత కథానాయికలు. మంగళవారం వరకు చండీఘడ్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ ఈ రోజు పటియాలాలో మొదలైంది. మూడు రోజులు అక్కడే షూటింగ్ జరిపి, తిరిగి చండీఘడ్ చేరుకుని అక్కడ షూటింగ్ జరుపుతారని సమాచారం. సో... చండీఘడ్ టు పటియాలా నితిన్ రౌండ్స్ కొడుతున్నారన్నమాట.