కళ్యాణం.. వైభోగం.. ఆనంద రాగాల శుభయోగం.. | Kalyanam Vybhogam Lyrical Song From Srinivasa Kalyanam | Sakshi
Sakshi News home page

కళ్యాణం.. వైభోగం.. ఆనంద రాగాల శుభయోగం..

Published Tue, Jul 10 2018 11:25 AM | Last Updated on Tue, Jul 10 2018 12:45 PM

Kalyanam Vybhogam Lyrical  Song From Srinivasa Kalyanam - Sakshi

శ్రీనివాస కల్యాణం సినిమాలో నితిన్‌, రాశి ఖన్నా

నితిన్‌ హీరోగా తెరకెక్కిన ‘శ్రీనివాస్‌ కల్యాణం’  సినిమా రిలీజ్‌కు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ‘శతమానం భవతి’  ఫేమ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

‘కళ్యాణం.. వైభోగం.. ఆనంద రాగాల శుభయోగం’  అనే పల్లవితో మొదలై.. రుక్మిణీ కల్యాణం, సీతా స్వయంవరం, శ్రీనివాస కల్యాణ ఘట్టాలను ఉటంకిస్తూ వివాహ ప్రాశస్త్యాన్ని వివరించే ఈ పాట సంగీత ప్రియుల మనసు దోచుకుంటోంది. మిక్కీ జే మేయర్‌ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్‌ అందించగా ఎస్పీ బాలు తన స్వరంతో ప్రాణం పోశారు. చాలా కాలం తర్వాత సాహిత్య విలువలు ఉన్న పాట వినడం సంతోషంగా ఉందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను వినేయండి మరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement