
ఏంటి ఇదేదో.. ఫోన్‌కొట్టు పట్టుచీర పట్టు లాంటి ప్రోగ్రామ్ అనుకుంటున్నారా? ఇది అలాంటి కాన్సెప్ట్ కాదులేండి. అచ్చమైన తెలుగుదనాన్ని చూపిస్తూ.. పెళ్లి వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతోన్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా నిర్మాత దిల్ రాజు పెట్టిన కాంటెస్ట్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది చిత్ర బృందం.
శ్రావణ మాసంలో పెళ్లి జరుపుకుంటున్న జంటలు తమ శుభలేఖలు పంపిస్తే.. ఆ జంటలందరికీ పట్టు వస్త్రాలు పెట్టాలని సంకల్పించినట్టు తెలిపారు. ఇలా అందులోంచి కొందరిని ఎంపిక చేసి.. శ్రీనివాస కళ్యాణం బృందంతో మాట్లాడే వీలును కల్పించనున్నట్లు ప్రకటించారు. మరి శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే వారంతా.. వారి శుఖలేఖలు పంపించి.. పట్టువస్త్రాలను పొందండి. ప్రత్యక్షంగానైనా కలవచ్చు లేక పోస్ట్‌లోనైనా పంపొచ్చు అని పేర్కొన్నారు.
మీ శుభలేఖలు మాకు పంపిస్తే ఆ జంటలు అందరికీ పట్టు వస్త్రాలు పెట్టాలని సంకల్పించాము. :) @actor_nithiin @RaashiKhanna @Nanditasweta @mickeyjmeyer
— Sri Venkateswara Creations (@SVC_official) August 6, 2018
Directed by #VegesnaSatish#SrinivasaKalyanam #SrinivasaKalyanamFromAug9th pic.twitter.com/5Jeah1wtbT