Sri Venkateswara Creations
-
రామ్‌చరణ్- శంకర్ మూవీ.. అవన్నీ వట్టి పుకార్లే!
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తన లుక్ మార్చేశాడు రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఆయన ఈ మూవీ కోసం భారీగా కసరత్తులు చేస్తున్నాడు. ఫిట్నెస్ కోసం, స్పెషల్ లుక్‌లో కనిపించేందుకు స్పెషల్ వర్కవుట్స్ చేస్తున్నాడట. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. డైరెక్టర్ శంకర్ నేరుగా తెలుగులో రిలీజ్ చేస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఫలానా నటీనటులు కనిపించబోతున్నారంటూ కొంతకాలంగా రూమర్స్ మొదలయ్యాయి. దీంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఆ వార్తలను తోసిపుచ్చింది. రామ్‌చరణ్- శంకర్ సినిమాలో ఫలానా నటీనటులు నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని కుండ బద్ధలు కొట్టేసింది. సినిమా టైటిల్స్ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. మా ప్రాజెక్ట్‌లో ఏదైనా పాత్ర కోసం నటీనటులను ఎంపిక చేసే అధికారం ఏ వ్యక్తికీ, ఏ ఏజెన్సీకి లేదని స్పష్టం చేసింది. దయచేసి ఇలాంటి అసత్యపు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. A note of caution to everyone #RC15 #SVC50 pic.twitter.com/KRPiykeCk2 — Sri Venkateswara Creations (@SVC_official) July 24, 2022 చదవండి: రాణి లక్ష్మీబాయి సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందంటే? -
Dil Raju: నా జీవితంలో అది చూడాలని ఉంది
‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(ఎస్వీసీ) బ్యానర్‌ని 2003లో స్థాపించి ‘దిల్’ సినిమాతో నిర్మాతగా ప్రయాణం ప్రారంభించాను. ఎస్‌వీసీపై 50వ సినిమా చేస్తున్నాం. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఓ లోగో డిజైన్ చేశారు.. దేవుడి ఆశీర్వాదాలతో నా జీవితంలో ఎస్వీసీ లోగోను కూడా అలా చూడాలని ఉంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్, జీ 5 కాంబినేషన్లో ఎస్. హరీష్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా చంద్రమోహన్ డైరెక్షన్లో ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ రూపొందనుంది. గురువారం విలేకరుల సమావేశంలో ఈ వెబ్ సిరీస్ వివరాలను వెల్లడించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజు ప్రొడక్షన్లో ప్రయోగాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తాయి. ‘హిట్, జెర్సీ’ సినిమాలతో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ త్వరలో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక తెలుగులో హర్షిత్, హన్షితలకు ‘దిల్’ రాజు ప్రొడక్షన్ బాధ్యతలను నేను, శిరీష్ అప్పగించాం’’ అన్నారు. ‘‘ఏటీఎమ్’ స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే హాలీవుడ్ తరహాలో ఉంటుంది’’ అన్నారు ‘జీ 5’ వైస్ ప్రెసిడెంట్ పద్మ. ‘‘ఏటీఎమ్’ తొలి సీజన్ ఏడు ఎపిసోడ్స్ ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ చంద్రమోహన్. ‘‘ఎస్వీసీని సినిమా రంగంలో ఆదరించినట్టే ‘దిల్’ రాజు ప్రొడక్షన్‌ని డిజిటల్ మాధ్యమంలోనూ ఆదరించాలి’’ అన్నారు హన్షిత రెడ్డి. ‘‘మా మేనేజర్ కల్యాణ్‌గారి వల్లే ‘ఏటీఎమ్’ కథను రాశాను’’ అన్నారు ఎస్. హరీష్ శంకర్. -
కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం
‘‘ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు మాకు అద్భుతమైన ప్రయాణం దొరికినందుకు ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ నుంచి మేము తీసుకున్న దానికి, మాకు లభించిన అనుభవాన్ని పంచాలనుకుంటున్నాం. ఇందుకోసం కొంతమంది నిర్మాతలతో మా వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) అసోసియేట్ అవుతోంది. స్క్రిప్ట్ నుంచి రిలీజ్ డేట్ వరకు ఆయా చిత్రనిర్మాతలకు మా సంస్థ నుంచి మద్దతు ఇస్తాం. మా సంస్థ ద్వారా ఎంతోమంది నిర్మాతలకు, రాబోయే నిర్మాతలకు ఉపయోగపడాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాం’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. పంపిణీరంగం నుంచి నిర్మాతగా మారి, ఎన్నో విజయాలు చూస్తున్నారు ‘దిల్’ రాజు. ఎస్వీసీ సంస్థ 20ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘1999లో ‘ఒకే ఒక్కడు’ సినిమాతో మా వెంకటేశ్వర ఫిల్మ్స్ మొదలైంది. ఈ సినిమాకు ముందు (1998 జూలై 24) ఇదే జూలై 24న ‘తొలిప్రేమ’ చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్లో భాగస్వామ్యులుగా ఉన్నాం. పవన్‌కల్యాణ్‌గారిని స్టార్‌ని చేసిన సినిమా అది. ‘పెళ్లి పందిరి’ సినిమా సక్సెస్ మమ్మల్ని ఇక్కడివరకూ తీసుకువచ్చింది. ఈ రెండు సినిమాల నిర్మాతలకు థ్యాంక్స్. అలాగే మా డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన నిర్మాతలందరికీ ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఈ పదహారేళ్లలో 32 సినిమాలు తీశాం. 2017లో ఆరు, గత ఏడాది మూడు సినిమాలు మా సంస్థ నుంచి వచ్చాయి. ఈ ఏడాది నాలుగు సినిమాల రిలీజ్లు ప్లాన్ చేస్తున్నాం. ఒక సినిమా సక్సెస్ కావాలంటే స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు కావాల్సినవి ఎన్నో ఉంటాయి. శివలెంక కృష్ణప్రసాద్‌గారు, విజయ్, సత్యనారాయణరెడ్డి, కృష్ణ, గోపీ, రాహుల్, హరి, సాగర్, రాహుల్ యాదవ్ నక్కా, విజయ్ చిల్లా, మహేశ్ కోనేరు, రాజీవ్.. ఇలా ఈ నిర్మాతలందరితో మాకు ఒక మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని తర్వాత స్థాయికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో మా సంస్థతో అసోసియేషన్ గురించి ఆలోచించాం. వారితో ట్రావెల్ అవుతూ మా సంస్థ నుంచి వస్తున్న మంచి సినిమాల మాదిరిగానే వారు కూడా మంచి సినిమాలు తీయడానికి మా వంతు కృషి చేస్తాం. వీరేకాదు, మంచి సినిమాలు చేయాలని మంచి స్క్రిప్ట్‌ను తీసుకువస్తే మా ఎస్వీసీని వాడుకుని తెలుగు ఇండస్ట్రీకి మంచి సినిమాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాం.అలాగే డబ్బు సంపాదిస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. హారిక హాసిని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కూడా ఈ సందర్భంగా «థ్యాంక్స్’’ అని అన్నారు. ‘‘రాజుగారితో నాకు 18ఏళ్ల పరిచయం ఉంది. సినిమాలపై పిచ్చితో ఇండస్ట్రీవైపు వచ్చారు రాజు, శిరీష్, లక్ష్మణ్. ‘ఎస్వీసీ’ సక్సెస్ఫుల్ జర్నీలో నా వంతుగా నాలుగు సినిమాలు ఉండటం హ్యాపీగా ఉంది. ఎస్వీసీని నా మాతృసంస్థగా భావిస్తాను. రైటర్‌గా నాకు జన్మనిచ్చారు. ఈ సంస్థ సపోర్ట్‌తో నాలాంటి దర్శకులు చాలామంది స్థిరపడే అవకాశం ఉంది’’ అన్నారు దర్శకుడు వంశీపైడిపల్లి. ‘‘ఎస్వీసీ’ జర్నీలో నాది 2015–2019 టైమ్. ‘దిల్’ రాజుగారి జడ్జిమెంట్, లక్ష్మణ్ ప్లానింగ్, శిరీష్ ఎగ్జిక్యూషనే ఈ సంస్థ సక్సెస్‌కు కారణమనిపిస్తోంది. ఎస్వీసీ అంటే సక్సెస్ వీళ్ల కేరాఫ్ అడ్రస్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఇండస్ట్రీలో అన్నింటినీ అన్ని రకాలుగా చూసినవాడే నిర్మాత. ఈ ముగ్గురూ ఇంత దూరం వచ్చారు. వీరితో అసోసియేట్ అవ్వడం హ్యాపీ’’ అన్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ‘‘ఇలాంటి పెద్దబ్యానర్లో అసోసియేట్ అయితే చిన్న సినిమాలు మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతాయి’’ అన్నారు నిర్మాత రాహుల్ యాదవ్. ‘‘నిర్మాత అంటే ప్రతిరోజూ యుద్ధమే. 20ఏళ్లలో దాదాపు 95 శాతం విజయాలతో ఈ సంస్థ టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా నిలబడింది’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. ‘‘ఆర్య’ సినిమా సమయంలో నేను, బన్నీవాసు, యూవీ క్రియేషన్స్ ఈ బ్యానర్‌తో అసోసియేట్ అయ్యాం. ఈ రోజు మేమంతా నిర్మాతలుగా మారాం’’ అన్నారు విజయ్ చిల్లా. ‘‘సినిమా చూపిస్తా మామా’ చిత్రం నుంచి ఈ సంస్థతో అసోసియేట్ అయ్యాను’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. లక్ష్మణ్, శిరీష్, సాగర్, కృష్ణ, గోపీ తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరి 1న దుబాయిలో శ్రీనివాస కల్యాణం
గల్ఫ డెస్క్: దుబాయిలో ఫిబ్రవరి 1న శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నారు. అజ్మన్ సిటీ సెంటర్ పక్కన గల అల్‌జర్ఫ్ హబిటాట్ స్కూల్లో ఈ వేడుక జరగనుంది. ఆ రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సుప్రబాతసేవ, 8 నుంచి 9 గంటల వరకు తోమాలసేవ, 9 నుంచి 10 గంటల వరకు 108 కలశాలతో అభిషేకం జరుగుతుంది. 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుకల్యాణం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు సర్వదర్శనం, 4 నుంచి 5 గంటల వరకు విష్ణుసహస్రనామం, 5నుంచి గరుడ సేవ ఉంటుం ది. యూఏఈలో మొదటిసారిగా స్వామివారి గరుడసేవ నిర్వహిస్తున్నారు. వైభవోపేతంగా జరిగే స్వామివారి కల్యాణ వేడుకలో పాల్గొనే వారు +971555794466, +971585771709 నంబర్లలో సంప్రదించవచ్చు. -
శుభలేఖ పంపండి.. పట్టు వస్త్రాలు పొందండి!
ఏంటి ఇదేదో.. ఫోన్‌కొట్టు పట్టుచీర పట్టు లాంటి ప్రోగ్రామ్ అనుకుంటున్నారా? ఇది అలాంటి కాన్సెప్ట్ కాదులేండి. అచ్చమైన తెలుగుదనాన్ని చూపిస్తూ.. పెళ్లి వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతోన్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా నిర్మాత దిల్ రాజు పెట్టిన కాంటెస్ట్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది చిత్ర బృందం. శ్రావణ మాసంలో పెళ్లి జరుపుకుంటున్న జంటలు తమ శుభలేఖలు పంపిస్తే.. ఆ జంటలందరికీ పట్టు వస్త్రాలు పెట్టాలని సంకల్పించినట్టు తెలిపారు. ఇలా అందులోంచి కొందరిని ఎంపిక చేసి.. శ్రీనివాస కళ్యాణం బృందంతో మాట్లాడే వీలును కల్పించనున్నట్లు ప్రకటించారు. మరి శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే వారంతా.. వారి శుఖలేఖలు పంపించి.. పట్టువస్త్రాలను పొందండి. ప్రత్యక్షంగానైనా కలవచ్చు లేక పోస్ట్‌లోనైనా పంపొచ్చు అని పేర్కొన్నారు. మీ శుభలేఖలు మాకు పంపిస్తే ఆ జంటలు అందరికీ పట్టు వస్త్రాలు పెట్టాలని సంకల్పించాము. :) @actor_nithiin @RaashiKhanna @Nanditasweta @mickeyjmeyer Directed by #VegesnaSatish#SrinivasaKalyanam #SrinivasaKalyanamFromAug9th pic.twitter.com/5Jeah1wtbT — Sri Venkateswara Creations (@SVC_official) August 6, 2018 -
భయానక అనుభూతికి లోనయ్యా!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో వస్తున్న 5 తాజా సినిమాల విడుదల తేదీలను షెడ్యూలు చేశారు. ఆ వివరాలను మూవీ బజ్ అధికారిక ట్విటర్లో వెల్లడించారు. ఇది చూసిన ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీశ్ శంకర్ ఏ విధమైన అనుభూతికి లోనయ్యాడు. ‘ఆ ఐదు సినిమాల జాబితాలో నా మూవీ లేదు. భయంకరమైన అనుభూతికి లోనయ్యాను. కానీ కొన్నిసార్లు ఇలాంటివి తప్పవు. ఆ 5 మూవీలు సక్సెస్ కావాలని కోరుకుంటూ’ హరీశ్ తన ట్వీటర్లో రాసుకొచ్చారు. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రాబోతున్న 5 మూవీల విడుదల తేదీలు.. లవర్- జూలై 20, 2018, శ్రీనివాసకల్యాణం- ఆగస్టు 9, 2018, హలోగురు ప్రేమకోసమే అక్టోబర్ 18, 2018, ఎఫ్2- జనవరి 12, 2019, ఎస్ఎస్ఎంబీ25- ఏప్రిల్ 5, 2019 అని మూబీ బజ్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీశ్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కి గతేడాది విడుదలైన దువ్వాడ జగన్నాథం భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ మూవీలో నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. Missed my film in this list .... Feeling weird ..... but konni saarlu konni thappavu .. My whole hearted Best wishes to all the 5 films 👍👍👍👍👍 https://t.co/TcpcqVcODX — Harish Shankar .S (@harish2you) 18 July 2018 -
‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సెలబ్రేటింగ్ 2017’
-
రోజులు మారాయి..
వరుస హిట్లతో దూసుకెళుతున్న దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘రోజులు మారాయి’. చేతన్ మద్దినేని, పార్వతీశమ్, కృతిక, తేజస్వి ప్రధాన పాత్రల్లో మురళీ కృష్ణ ముడిదానిని దర్శకునిగా పరిచయం చేస్తూ జి.శ్రీనివాసరావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. జేబీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ‘దిల్’రాజు మాట్లాడుతూ- ‘‘మారుతి కథలు ప్రధానంగా యువతను ఆకట్టుకుంటాయి. కానీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా బిజినెస్ ట్రేడ్‌లో సూపర్ క్రేజ్ రావడం విశేషం. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న సినిమా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. అలీ, పోసాని కృష్ణమురళి, రాజారవీంద్ర, హర్ష, సంధ్యా జనక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సారధ్యం: గుడ్ సినిమా గ్రూప్, సహ నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్