RC15 Movie: Sri Venkateswara Creations Gives Clarity On Rumours Over Title And Cast - Sakshi
Sakshi News home page

RC15 Movie: ఆ వార్తల్లో నిజం లేదన్న దిల్‌ రాజు బ్యానర్‌

Published Sun, Jul 24 2022 11:50 AM | Last Updated on Sun, Jul 24 2022 1:13 PM

RC15: Sri Venkateswara Creations Gives Clarity On Rumours - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత తన లుక్‌ మార్చేశాడు రామ్‌చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఆయన ఈ మూవీ కోసం భారీగా కసరత్తులు చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌ కోసం, స్పెషల్‌ లుక్‌లో కనిపించేందుకు స్పెషల్‌ వర్కవుట్స్‌ చేస్తున్నాడట. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. డైరెక్టర్‌ శంకర్‌ నేరుగా తెలుగులో రిలీజ్‌ చేస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఫలానా నటీనటులు కనిపించబోతున్నారంటూ కొంతకాలంగా రూమర్స్‌ మొదలయ్యాయి. దీంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ ఆ వార్తలను తోసిపుచ్చింది. రామ్‌చరణ్‌- శంకర్‌ సినిమాలో ఫలానా నటీనటులు నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని కుండ బద్ధలు కొట్టేసింది. సినిమా టైటిల్స్‌ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. మా ప్రాజెక్ట్‌లో ఏదైనా పాత్ర కోసం నటీనటులను ఎంపిక చేసే అధికారం ఏ వ్యక్తికీ, ఏ ఏజెన్సీకి లేదని స్పష్టం చేసింది. దయచేసి ఇలాంటి అసత్యపు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది.

చదవండి: రాణి లక్ష్మీబాయి సీరియల్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఇప్పుడెలా ఉందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement