భయానక అనుభూతికి లోనయ్యా! | Harish Shankar Responds On No Latest Movie With Dil Raju | Sakshi
Sakshi News home page

భయానక అనుభూతికి లోనయ్యా!

Published Wed, Jul 18 2018 3:31 PM | Last Updated on Wed, Jul 18 2018 4:54 PM

Harish Shankar Responds On No Latest Movie With Dil Raju - Sakshi

నిర్మాత దిల్‌ రాజుతో దర్శకుడు హరీశ్‌ శంకర్ (పాత చిత్రం)

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో వస్తున్న 5 తాజా సినిమాల విడుదల తేదీలను షెడ్యూలు చేశారు. ఆ వివరాలను మూవీ బజ్‌ అధికారిక ట్విటర్‌లో వెల్లడించారు. ఇది చూసిన ‘గబ్బర్‌ సింగ్‌’ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఏ విధమైన అనుభూతికి లోనయ్యాడు. ‘ఆ ఐదు సినిమాల జాబితాలో నా మూవీ లేదు. భయంకరమైన అనుభూతికి లోనయ్యాను. కానీ కొన్నిసార్లు ఇలాంటివి తప్పవు. ఆ 5 మూవీలు సక్సెస్‌ కావాలని కోరుకుంటూ’ హరీశ్‌ తన ట్వీటర్‌లో రాసుకొచ్చారు.

దిల్‌ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో రాబోతున్న 5 మూవీల విడుదల తేదీలు..  లవర్‌- జూలై 20, 2018, శ్రీనివాసకల్యాణం- ఆగస్టు 9, 2018, హలోగురు ప్రేమకోసమే అక్టోబర్‌ 18, 2018, ఎఫ్‌2- జనవరి 12, 2019, ఎస్‌ఎస్‌ఎంబీ25- ఏప్రిల్‌ 5, 2019 అని మూబీ బజ్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కి గతేడాది విడుదలైన దువ్వాడ జగన్నాథం భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఆ మూవీలో నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement