
నితిన్, నందిత శ్వేత
ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న యంగ్ హీరో నితిన్, ఆ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకు శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాలో నితిన్‌కు హీరోయిన్‌ను ఫైనల్ చేశారు.
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కన్నడ బ్యూటి నందిత శ్వేత. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన ఈ అందాల భామ శ్రీనివాస్ కళ్యాణంలో నితిన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. నందిత ఎంపికపై టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్న చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment