తిరుపతి కల్చరల్: టీటీడీ శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో వచ్చే నెల 5వ తేదీ నుంచి ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్లు టీటీడీ పీఆర్‌వో టి.రవి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5న విజయనగరం జిల్లా గుమ్మా లక్ష్మీపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 7న విశాఖ జిల్లా జి.మాడుగుల మండల కేంద్రంలోని రామాలయంలో, 11న గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాజవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అలాగే 12న తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని సోమేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 27న తమిళనాడు శివగంగ జిల్లా దేవకొట్టై మండల కేంద్రంలోని ఎన్‌ఎస్‌ఎంవీపీఎస్ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారని తెలిపారు.
5 నుంచి ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు
Published Mon, Aug 31 2015 4:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement
Advertisement