
శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్, రాశీఖన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. గోదావరి జిల్లాలతో పాటు ఛండీఘర్‌లో చిత్రకరణ పూర్తి చేశారు.
ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా ప్రారంభమైన ఈ సినిమాను ఆగస్టు 9న రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ జోరు పెంచిన చిత్రయూనిట్ సూపర్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేయిస్తున్నారు. రేపు (గురువారం) సాయంత్రం ఐదు గంటలకు ముప్పై నిమిషాలకు మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment