‘పక్కా ప్రామిస్‌’.. ఈ ఏడాది 2 సినిమాలు | Nithin Promises to Release 2 Movies This Year | Sakshi
Sakshi News home page

‘పక్కా ప్రామిస్‌’.. ఈ ఏడాది 2 సినిమాలు

Published Wed, Mar 6 2019 2:05 PM | Last Updated on Wed, Mar 6 2019 2:07 PM

Nithin Promises to Release 2 Movies This Year - Sakshi

హీరోగా చాలా కాలంగా కొనసాగిస్తున్న టాప్‌ స్టార్స్‌ లిస్ట్‌ లో చేరటంలో ఫెయిల్ అవుతున్నాడు నితిన్‌. చివరగా శ్రీనివాస కల్యాణం సినిమాలో కనిపించిన నితిన్‌ తరువాత మరో సినిమాను ప్రారంభించలేదు. ఛలో ఫేం వేణు ఉడుగుల దర్శకత్వంలో భీష్మా సినిమాను ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే ఈ విషయంపై అభిమానులు పదే పదే ప్రశ్నిస్తుండటంతో నితిన్‌ క్లారిటీ ఇచ్చాడు.

‘ఈ నెలాఖరున తదుపరి చేయబోయే సినిమాలపై ప్రకటన చేస్తాను. పక్కా ప్రామిస్‌.. షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాను’ అంటూ అభిమానులు ఓపిగ్గా ఎదురుచూస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు నితిన్‌. వరుస డిజాస్టర్లతో ఇబ్బందుల్లో పడ్డ నితిన్‌ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement