‘‘పదిహేనేళ్లలో 30 సినిమాలు చేశా. ఇప్పుడున్నంత కన్‌ఫ్యూజన్‌లో ఎప్పుడూ లేను. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎక్కువ సక్సెస్ పర్సంటేజ్‌తో సినిమాలు చేశాను. స్పీడ్ బ్రేకులు పడ్డప్పుడల్లా సక్సెస్ సాధిస్తూ వచ్చాను’’ అన్నారు ‘దిల్’ రాజు. నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి ఫస్ట్ నుంచే పాజిటివ్ టాక్ ఉంది. యూత్, రివ్యూవర్స్ అందరూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి మిక్స్‌డ్ వార్తలు స్ప్రెడ్ చేశారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మౌత్ టాక్‌తో ఈ సినిమాను ఇంకా ముందుకు తీసుకెళతారని ఆశిస్తున్నాను.
సతీష్ దర్శకత్వంలో మా బ్యానర్‌లోనే ‘థ్యాంక్స్’ అనే సినిమా చేయబోతున్నాం. ‘మీకు ఎలా చెప్పాలో’ అనేది క్యాప్షన్. ఈ సినిమాలో ఏయే అంశాలు మిస్ అయ్యాయని అంటున్నారో అవన్నీ ‘థ్యాంక్స్’లో ఉంటాయి’’ అన్నారు. ‘‘ఏ ఫ్యామిలీ ఆడియన్స్ కోసమైతే ఈ సినిమా చేశామో వారికి ఈ సినిమా నచ్చడం మరో సక్సెస్. ప్రేక్షకుల అభినందనలే మాకు ఆశీర్వాదాలు. మంచి సినిమా చేశామనే తృప్తి కలిగింది’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘కథను నమ్మి, ప్రేమించి చేసిన చిత్రమిది. ఫ్యామిలీ ఆడియన్స్ మరింత సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు నితిన్. సితార, రాశీ ఖన్నా, నందితా శ్వేతా తదితరులు పాల్గొన్నారు.
మౌత్ టాక్‌తో ముందుకు తీసుకెళ్లాలి
Published Wed, Aug 15 2018 1:09 AM | Last Updated on Wed, Aug 15 2018 1:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment