
కల్యాణం వచ్చినా! కక్కొచ్చినా ఆగదని తెలుగులో ఓ సామెత. అంటే... ప్రతిదానికీ ఓ టైమ్ రావాలి. టైమ్ వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు. సిన్మాల్లోనూ అంతే! కొన్ని కాంబినేషన్లు కుదరడానికి టైమ్ రావాలి. అలాగే... హీరో నితిన్, నిర్మాత ‘దిల్’ రాజు కాంబి నేషన్ మళ్లీ కుదరడానికి 14 ఏళ్లు పట్టింది. నితిన్ హీరోగా పరిచయమైన ‘దిల్’తో, ఆ చిత్రనిర్మాత వెంకట రమణ అలియాస్ రాజు చిత్రపరిశ్రమలో ‘దిల్’ రాజుగా స్థిరపడ్డారు. అది విడుదలైన 14 ఏళ్లకు ఈ హీరో, నిర్మాత మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు.
‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘శ్రీనివాస కల్యాణం’ అనే పేరుని నిర్ణయించారు. శనివారం ఈ చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది వసంత మాసం (మార్చి)లో చిత్రీకరణ ప్రారంభించి, శ్రావణ మాసం (ఆగస్టు)లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె. మేయర్.
Comments
Please login to add a commentAdd a comment