
రాశీ ఖన్నా
సింగపూర్‌కు బై బై చెప్పి, అమలాపురంలో వాలిపోయారు హీరోయిన్ రాశీ ఖన్నా. ఎందుకు? సింగపూర్ హాలీడే ట్రిప్‌లో చేసినట్లు ఇక్కడ కూడా ఏవైనా అడ్వెంచర్స్ ప్లాన్ చేశారా? అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. సినిమా షూటింగ్‌లో జాయిన్ అవ్వడానికి అమలాపురంలో అడుగుపెట్టారు రాశీ. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘శ్రీనివాసకల్యాణం’. రాశీ ఖన్నా, నందితా శ్వేత కథానాయికలు.
ప్రస్తుతం అమలాపురంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూట్‌లో జాయిన్ అవ్వడానికే రాశీ అమలాపురం వెళ్లారు. అంతకు ముందు తమిళంలో ‘జయం’ రవితో నటిస్తున్న సినిమా షెడ్యూల్‌ని కంప్లీట్ చేసుకుని హాలీడే కోసం రాశీఖన్నా సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ‘‘గుడ్‌బై చెప్పడం నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ వెళ్లాలి. బై బై సింగపూర్. ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో జాయిన్ అయ్యేందుకు అమలాపురం వచ్చాను’’ అని పేర్కొన్నారు రాశీఖన్నా.
Comments
Please login to add a commentAdd a comment