
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. నేను శైలజ సినిమాతో రామ్ కెరీర్ ను మలుపు తిప్పిన కిశోర్ తిరుమల మరోసారి రామ్ హీరో ఉన్నది ఒకటే జిందగీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రామ్ సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు రామ్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు, టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావటంతో చిత్రయూనిట్ సినిమా ఘనవిజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్ ట్రై చేసిన రామ్ రాక్ స్టార్ గా దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఉన్నది ఒకటే జిందగీ క్లీన్ యు సర్టిఫికేట్ తో సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment