‘‘సినిమాకు కథ చాలా ఇంపార్టెంట్. నాకొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటా. ప్రతి సినిమాను ఫస్ట్ మూవీలానే ఫీలవుతా. సక్సెస్‌ను ఎడ్వాంటేజ్‌గా తీసుకుని ఏదైనా చెప్పేయొచ్చు అనుకోను’’ అన్నారు కిశోర్ తిరుమల. రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉన్నది ఒక్కటే జిందగీ’. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. కిశోర్ తిరుమల చెప్పిన విశేషాలు...
► రియల్ లైఫ్‌కి దగ్గరగా ఫ్రెండ్‌షిప్ అండ్ లవ్ నేపథ్యంలో తెరక్కిన చిత్రమిది. ప్రతిదీ పాజిటివ్ క్యారెక్టరే. పరిస్థితులే విలన్‌గా మారతాయి. సిన్మా చూస్తుంటే... యాక్టర్స్ కనపడరు, క్యారెక్టరైజేషన్సే కనపడతాయి. పాజిటివ్ ఫీల్ కోసం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ అని టైటిల్ పెట్టాం. సినిమాలో మేసేజ్‌లు, ఫిలాసఫీ ఉండవు.
► అభిరామ్ (రామ్) క్యారెక్టర్ మెచ్యూర్ అండ్ సింపుల్. అభిరామ్‌కి ఫ్రెండ్‌షిప్ ఇంపార్టెంట్. చాలా సింపుల్‌గా డెసిషన్స్ తీసుకుంటాడు. కానీ, ప్రతి నిర్ణయం వెనక బలమైన కారణం ఉంటుంది. ఈ సినిమా లైన్ ఏడాదిన్నర క్రితం అనుకున్నాం. కథను డెవలప్ చేయడానికి ఏడాది పట్టింది. కథ రాసుకున్న తర్వాతే... రామ్‌ను అప్రోచ్ అవ్వడం జరిగింది. రామ్‌లో బాగా కాన్ఫిడెంట్ లెవల్స్ పెరిగాయి. అందుకే మీరు ఏ క్యారెక్టర్ అయినా చేయగలరన్నాను. ఈ సినిమా కోసం రామ్ మూడు నెలల పాటు గిటార్ నేర్చుకున్నారు. శ్రీవిష్ణు నాకు నాలుగైదేళ్లుగా తెలుసు. అభిరామ్ ఫ్రెండ్‌గా వాసు పాత్రలో బాగా నటించారు. అనుపమ పాత్రకు అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారు. లావణ్యది ఎంటర్‌టైనింగ్ రోల్.
► ‘నేను.. శైలజ’కి దేవిశ్రీ మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమాలోనూ మ్యూజిక్‌కు ఎక్కువ స్కోప్ ఉంది. అందుకే, దేవిగారిని తీసుకున్నాం. ‘వాట్ అమ్మా...’ బ్రేకప్ సాంగ్ కాదు. వెంకటేశ్‌గారి మ్యానరిజమ్‌ని దృష్టిలో పెట్టుకుని ‘వాట్ అమ్మా’ మ్యానరిజమ్‌ని పెట్టలేదు. ఈ సాంగ్ విని వెంకటేశ్‌గారు ఫోన్ చేసి అభినందించారు.
► ప్రస్తుతం నా దగ్గర మూడు కథలు ఉన్నాయి. ఒకటి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మరొకటి యూత్‌ఫుల్ మూవీ. ఏ కథ చేస్తే బాగుంటుందో ఆలోచించి నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా. నాని, నితిన్‌తో సినిమాలు చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి కదా? అనడిగితే – ‘‘స్క్రిప్ట్ ఇంకా ఫామ్ అవ్వలేదు’’ అన్నారు.
అందుకే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటా!
Published Fri, Oct 20 2017 11:30 PM | Last Updated on Sat, Oct 21 2017 12:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment