అభిరామ్‌ జిందగీ | Unnadi Okate Zindagi release on October 27th | Sakshi
Sakshi News home page

అభిరామ్‌ జిందగీ

Published Tue, Oct 3 2017 12:18 AM | Last Updated on Tue, Oct 3 2017 8:23 AM

Unnadi Okate Zindagi release on October 27th

ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడని నమ్మే యువకుడు అభిరామ్‌. ఓ రాక్‌బ్యాండ్‌కి లీడర్‌ అతను. హ్యాపీగా వెళ్తోన్న అభిరామ్‌ జిందగీలోకి ఇద్దరు అమ్మాయిలొస్తారు. వాళ్లలో ఎవర్ని అభిరామ్‌ ప్రేమించాడు? అతని జిందగీలో స్నేహితులు ఎలాంటి పాత్ర పోషించారు? అసలు అభిరామ్‌ కథేంటి? అనేది ఈ నెల 27న చూపిస్తామంటున్నారు దర్శకుడు కిశోర్‌ తిరుమల. రామ్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’.

అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ‘స్రవంతి’ రవికిశోర్‌ మాట్లాడుతూ– ‘‘ఇటలీలో రామ్‌పై చిత్రీకరించిన సన్నివేశాలతో షూటింగ్‌ అంతా పూర్తయింది. ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. త్వరలో పాటల్ని, అక్టోబర్‌ 27న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘అభిరామ్‌ అనే వ్యక్తి జిందగీలో చైల్డ్‌హుడ్, కాలేజ్‌ లైఫ్, కాలేజ్‌ తర్వాత లైఫ్‌ ఎలా ఉందనేది సిన్మా. అభిరామ్‌గా పాత్ర కోసం బాడీ మేకోవర్‌ కావడంతో పాటు సరికొత్త స్టైల్‌లోకి మారారు రామ్‌’’ అన్నారు దర్శకుడు కిశోర్‌ తిరుమల. శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, కౌశిక్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement