లైఫ్‌లో ఏం కావాలో తెలుసు | Vunnadhi Okate Zindagi is yet another LOOK release | Sakshi
Sakshi News home page

లైఫ్‌లో ఏం కావాలో తెలుసు

Published Mon, Sep 4 2017 12:46 AM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

లైఫ్‌లో ఏం కావాలో తెలుసు

లైఫ్‌లో ఏం కావాలో తెలుసు

ఎవరికి? అభిరామ్‌కు. అతనెవరు? ఓ రాక్‌ బ్యాండ్‌కి లీడర్, గిటారిస్ట్‌. అంతేనా... లైఫ్‌లో చెప్పుకోవడానికి మరొకటి లేదా? ఉంది, అతనో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. స్పెషల్‌ ఏంటంటే... ఐదుగురు స్నేహితుల అభిరామ్‌ గ్యాంగ్‌లో ఆమె ఒకరు. చిన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత... అభిరామ్‌ అండ్‌ అమ్మాయి ప్రయాణంలో ఎన్ని మలుపులున్నాయి? వీళ్లిద్దరి ప్రేమ కథేంటి? అనేది ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రకథ అంటున్నారు రామ్‌.

‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన అభిరామ్‌గా నటిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ ఈ సిన్మాలో రామ్‌ లుక్‌ విడుదలైంది. గుబురుగా పెంచుకున్న గడ్డం, మీసాలు, జిమ్‌ బాడీతో మ్యాచోగా కనిపిస్తున్నారు. ఇది కాకుండా మరో లుక్‌ కూడా ఉందట. త్వరలో దాన్ని విడుదల చేస్తామంటున్నారు. స్రవంతి సినిమాటిక్స్, పీఆర్‌ సినిమాస్‌ సంస్థలపై కృష్ణచైతన్య నిర్మిస్తున్న ఈ సినిమా గురించి రామ్‌ మాట్లాడుతూ– ‘‘లైఫ్‌లో తనకు ఏం కావాలో స్పష్టంగా తెలిసిన అభిరామ్‌ క్యారెక్టరైజేషన్‌ నాకు బాగా నచ్చింది. నన్ను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లే చిత్రమిది’’ అన్నారు. లావణ్యా త్రిపాఠి, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement