
కృష్ణుడితోనా.. అర్జునుడితోనా... యుద్ధం ఎవరితో?
ఆల్రెడీ యుద్ధం మొదలైంది! ఎవరెవరికి? కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య! ఈ యుద్ధంలోకి మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ అడుగుపెట్టారు.
ఆల్రెడీ యుద్ధం మొదలైంది! ఎవరెవరికి? కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య! ఈ యుద్ధంలోకి మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ అడుగుపెట్టారు. ఆమె కూడా యుద్ధం చేస్తున్నారు. అయితే... అనుపమది ప్రేమ యుద్ధం! అదీ ఒక్కరితోనే. కృష్ణుడితోనా... అర్జునుడితోనా... ఆమె ఎవరితో ప్రేమ యుద్ధం చేస్తున్నారనేది ఇక్కడ క్వశ్చన్! ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ సిన్మాల ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’.
ఇందులో అనుపమా పరమేశ్వరన్ ఓ హీరోయిన్. ఇటీవల యూరప్‌లోని ప్రాగ్‌లో మొదలైన షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటున్నారు. ఇద్దరు నానీల్లో ఆమె ఎవరికి జోడీగా నటిస్తున్నారో మరి! సెకండ్ హీరోయిన్‌గా ‘ఆకతాయి’ ఫేమ్ రుక్సార్ మీర్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. వెంకట్ బోయినపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: ‘హిప్ హాప్’ తమిళ.