
యంగ్ హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో అనుపమ నందిని పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ మూవీలోని నందిని పాత్రకు సంబంధించిన ఒక వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో అనుపమ చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంది.
Here it is!! 🤩
— Geetha Arts (@GeethaArts) September 10, 2021
Introducing the beautiful @anupamahere as #𝑵𝒂𝒏𝒅𝒊𝒏𝒊 from #18Pages 📜🦋#NandiniFirstLook ▶️ https://t.co/edXy4PnW3S@aryasukku #BunnyVas @actor_Nikhil @dirsuryapratap @GopiSundarOffl @NavinNooli @raparthysaran @SukumarWritings @GA2Official @adityamusic
ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాతో కెరియర్‌లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. అందులో ఒకపాత్ర గతం మరచిపోయే నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితంపై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవు.. ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది” అని నిఖిల్ కళ్లకు గంతల్లా పేపర్ కట్టి దానిపై రాసింది.