
నిఖిల్ సిద్దార్థ ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్. "జీఏ 2" పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నన్నయ్య రాసిన’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ ఆలపించారు. గోపి సుందర్ సంగీతం అందించారు.
ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా
ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా
నీలో స్వరాలకే నేనే సంగీతమై
నువ్వే వదిలేసిన పాటై సాగేనా
నన్నయ్య రాసిన కావ్యమాగితే, తిక్కన తీర్చేనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా ..
అని శ్రీమణి రచించిన లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి. సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment