Nikhil Siddharth 18 Pages Movie Earned Rs 20 Cr Gross Collection In 1 Week, Deets Inside - Sakshi
Sakshi News home page

18 Pages Box Office Collection Day 7: ‘18 పేజెస్‌’ వారం రోజుల కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?

Published Fri, Dec 30 2022 6:46 PM | Last Updated on Fri, Dec 30 2022 7:27 PM

Nikhil Siddharth 18 Pages Movie Earned Rs 20 Cr Gross Collection in 1 Week - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్ర 18 పేజెస్‌. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకుంది. దీంతో మొదటి రోజే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. కేవలం మౌత్‌ టాక్‌తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది.

ఈ సినిమా విడుదలై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికి థియేటర్లో అదే జోరు కొనసాగుతోంది. ఆడియన్స్‌ మళ్లీ మళ్లీ థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తుండటం విశేషం. ఫలితంగా ఈ సినిమా ఇప్పటివరకు (వారం రోజులకు) రూ.  20 కోట్ల గ్రాస్ సాధించి విజయంతంగా ముందుకు సాగుతుంది. కాగా బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పాన్‌ ఇండియా డైరెక్టర్‌ సుకుమార్‌ కథ అంధించిన సంగతి తెలిసిందే.

ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఒక ఫీల్గుడ్ లవ్‌స్టోరీకి కూడా సరైన ఆదరణ లభిస్తుంది అని నిరూపించింది ఈ క్రేజి లవ్ స్టోరీ. ఈ సినిమాలో సిద్ధు, నందినిల పాత్రలను మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్‌తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. 

చదవండి:
బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్‌ సాంగ్‌, గొంతు కలిపిన చిరు, రవితేజ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement