Nikhil Siddhartha 18 Pages Movie Release Date Announced, Deets Inside - Sakshi
Sakshi News home page

Nikhil Siddhartha : నిఖిల్‌, అనుపమల '18 పేజెస్‌' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. 

Published Tue, Oct 25 2022 3:27 PM | Last Updated on Tue, Oct 25 2022 6:22 PM

Nikhil Siddhartha Resumes Shooting For 18 Pages Release Date Announced - Sakshi

నిఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్‌. అనుపమ పరమేశ్వరన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే కార్తికేయ-2తో హిట్టు కొట్టిన ఈ జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మూవీపై బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ సినిమాకు సుకుమార్‌ కథ అందించారు. ఇదే కాకుండా గతంలో  కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా ఆయన కథను అందించిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ శిష్యుడు  పల్నాటి సూర్య ప్రతాప్ 18 పేజెస్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి GA2 పిక్చర్స్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్‌ ఇటీవల ప్రారంభం కాగా, నిఖిల్‌ ఈ షూటింగులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాను డిసెంబర్‌ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement